Vakeel Saab 2 : వకీల్ సాబ్ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నా.. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ మొదలైంది.. వేణు శ్రీరామ్

2021లో రిలీజైన వకీల్ సాబ్ సినిమా పవన్ అభిమానులకు ఫుల్ జోష్ ఇచ్చింది. ఈ సినిమా విజయం సాధించి పవన్ కెరీర్ ని మళ్ళీ గాడిలో పెట్టింది. ఈ సినిమాతో డైరెక్టర్ వేణు శ్రీరామ్ కూడా ఫామ్ లోకి వస్తాడు, వరుస సినిమాలు చేస్తాడు అనుకున్నారు అంతా.

Vakeel Saab 2 : వకీల్ సాబ్ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నా.. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ మొదలైంది.. వేణు శ్రీరామ్

Vakeel Saab 2 announced by director venu sriram

Updated On : April 11, 2023 / 8:47 AM IST

Vakeel Saab 2 :  పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సినిమాలకు గ్యాప్ ఇచ్చిన తర్వాత వకీల్ సాబ్(Vakeel Saab) సినిమాతో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చారు. ఇదే సినిమాతో డైరెక్టర్ వేణు శ్రీరామ్(Director Venu Sriram) కూడా గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చాడు. బాలీవుడ్(Bollywood) పింక్(Pink) సినిమాని రీమేక్ చేస్తూ, పవన్ కి తగ్గట్టు కమర్షియల్ అంశాలని జోడించి, తెలుగు(Telugu) నేటివిటీకి మార్చి వకీల్ సాబ్ సినిమాను తీశారు. పవన్ కళ్యాణ్ గ్రాండ్ కంబ్యాక్ సినిమా అవడంతో పవన్ అభిమానులు దీనిపై భారీ అంచనాలు పెట్టుకోగా ఈ సినిమా మంచి విజయం సాధించింది.

2021లో రిలీజైన వకీల్ సాబ్ సినిమా పవన్ అభిమానులకు ఫుల్ జోష్ ఇచ్చింది. ఈ సినిమా విజయం సాధించి పవన్ కెరీర్ ని మళ్ళీ గాడిలో పెట్టింది. ఈ సినిమాతో డైరెక్టర్ వేణు శ్రీరామ్ కూడా ఫామ్ లోకి వస్తాడు, వరుస సినిమాలు చేస్తాడు అనుకున్నారు అంతా. కానీ వేణుకి ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా ఓకే అవ్వలేదు. అల్లు అర్జున్ తో ఉన్న సినిమా కూడా క్యాన్సిల్ అయిపోయింది.

Pratik sanghar : నా ఐడియాను దొంగలించారు.. మరో వివాదంలో ఆదిపురుష్..

ఇటీవల వకీల్ సాబ్ సినిమా రిలీజయి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా వేణు శ్రీరామ్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పి పవన్ అభిమానులకు ఫుల్ జోష్ ఇచ్చాడు. వేణు శ్రీరామ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఏ సినిమా చెయ్యట్లేదు. మూడు ప్రాజెక్టులకు స్క్రిప్ట్ వర్క్స్ చేస్తున్నాను. అందులో వకీల్ సాబ్ 2 కూడా ఉంది. వకీల్ సాబ్ సీక్వెల్ సినిమాకు స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టాను. ఆ కథ అయ్యాక పవన్ గారికి వినిపిస్తాను అని తెలిపాడు. దీంతో పవన్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కి గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చిన వకీల్ సాబ్ సినిమాకు సీక్వెల్ రావాలని కోరుకుంటున్నారు. మరి పవన్ ప్రస్తుతం ఇటు సినిమాలు, అటు రాజకీయాలతో ఉన్న బిజీలో వకీల్ సాబ్ 2 ఎప్పుడు వస్తుందో.