Ustaad Bhagat Singh: ఎడిటింగ్ షురూ చేసిన ఉస్తాద్.. ఫ్యాన్స్ సిద్ధంగా ఉండాలంటోన్న హరీష్!

పవన్ కల్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుండి త్వరలోనే ఓ అప్డేట్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఎడిటింగ్ వర్క్‌ను స్టార్ట్ చేశారు.

Ustaad Bhagat Singh: ఎడిటింగ్ షురూ చేసిన ఉస్తాద్.. ఫ్యాన్స్ సిద్ధంగా ఉండాలంటోన్న హరీష్!

Ustaad Bhagat Singh Editing Work Begins

Updated On : April 26, 2023 / 5:31 PM IST

Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టుకుంది. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, ఈ సినిమా తొలి షెడ్యూల్ ముగించుకున్న సంగతి తెలిసిందే.

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్‌సింగ్ ఫస్ట్ లుక్ ఆ రోజున వస్తుందా..?

ఇక ఈ సినిమా నుండి ఓ అదిరిపోయే అప్డేట్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. అయితే ఈ అప్డేట్ కోసం తాజాగా ఎడిటింగ్ వర్క్‌ను స్టార్ట్ చేసింది చిత్ర యూనిట్. ఈ మేరకు చిత్ర యూనిట్ అఫీషియల్‌గా ఈ విషయాన్ని వెల్లడించింది. త్వరలోనే బ్లాస్టింగ్ అప్డేట్ రానుందని.. అభిమానలు సిద్ధంగా ఉండాలంటూ దర్శకుడు హరీష్ శంకర్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో పేర్కొన్నాడు. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుండి త్వరలోనే సాలిడ్ అప్డేట్ రానుండటంతో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Ustaad Bhagat Singh : ఉస్తాద్ నుంచి అదిరే అప్డేట్ ఇచ్చిన పవన్.. 8 రోజుల్లోనే!

ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోండగా, దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి ఈ సినిమా నుండి అప్డేట్ ఎప్పుడు వస్తుందా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.