Ustaad Bhagat Singh : ఉస్తాద్ నుంచి అదిరే అప్డేట్ ఇచ్చిన పవన్.. 8 రోజుల్లోనే!
పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మొదటి షెడ్యూల్ పూర్తి అయ్యింది. కేవలం 8 రోజుల్లోనే అన్ని సీన్లు షూట్ చేసేశారా?

Pawan Kalyan sreeleela Ustaad Bhagat Singh first schedule completed
Ustaad Bhagat Singh : పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ తరువాత దర్శకుడు హరీష్ శంకర్‌తో కలిసి చేస్తున్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఎనర్జిటిక్ హీరోయిన్ శ్రీలీల (sreeleela) ఈ సినిమాలో పవన్ కి జోడిగా నటిస్తుంది. కాగా ఇటీవలే ఈ మూవీ సెట్స్ కి వెళ్ళింది. మొదటి షెడ్యూల్ ఎనిమిది రోజుల పాటు జరిగింది. ఈ షెడ్యూల్ లో హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కించారు. స్టంట్ డైరెక్టర్స్ రామ్ లక్ష్మణ్ పర్యవేక్షణలో పవన్ కళ్యాణ్ తో పాటు వెయ్యి మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులు ఈ యాక్షన్ సీక్వెన్స్ లో పాల్గొన్నట్లు తెలియజేసింది చిత్ర యూనిట్.
Pawan Kalyan OG : పవన్ కళ్యాణ్ OG రెగ్యులర్ షూట్ స్టార్ట్ అయ్యేది అప్పుడేనా?
అలాగే పలువురు పిల్లలతో వినోదభరితమైన సన్నివేశాలు, పోలీస్ స్టేషన్ సెట్‌లో మరికొన్ని కీలకమైన సీన్లు, శ్రీలీలతో రొమాంటిక్ సన్నివేశాలను కూడా ఈ షెడ్యూల్ చిత్రీకరించారు. నర్రా శ్రీను, చమ్మక్ చంద్ర, గిరి, టెంపర్ వంశీ, నవాబ్ షా, కేజీఎఫ్ ఫేమ్ అవినాష్ వంటి పలువురు నటీనటులు ఈ షెడ్యూల్‌లో పాల్గొన్నారు. మొదటి షెడ్యూల్‌లో చిత్రీకరించిన సన్నివేశాల పట్ల చిత్ర బృందం ఎంతో సంతృప్తిగా ఉన్నట్లు తెలియజేశారు. హరీష్ శంకర్ ప్రీ-ప్రొడక్షన్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. అదిరిపోయే డైలాగ్స్ మరియు స్పెల్-బైండింగ్ మ్యానరిజమ్‌లతో పవన్ కళ్యాణ్‌ను విభిన్న కోణంలో చూపించి ప్రేక్షకులకు విందు అందించడం గ్యారెంటీ అని చెప్పుకొచ్చారు.
మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అశుతోష్ రాణా, గౌతమి, నాగ మహేష్, టెంపర్ వంశీ తదితరులు ఈ చిత్రంలో ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గబ్బర్ సింగ్ కోసం మెమరబుల్ ఆల్బమ్ ని అందించిన సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్, మరో బ్లాక్‌బస్టర్ ఆల్బమ్‌తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. సినిమాటోగ్రాఫర్ గా అయనంకా బోస్, ఆర్ట్ డైరెక్టర్ గా ఆనంద్ సాయి, ఎడిటర్ గా చోటా కె ప్రసాద్ ఇలా అగ్రశ్రేణి సాంకేతిక బృందం ఈ చిత్రానికి పని చేస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు మరియు తదుపరి షెడ్యూల్ వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.