‘వి’ : ఉగాది నుంచి ఆట, వేట మొదలు

నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు, అదితీ రావు హైదరీ, నివేదా థామస్ మెయిన్ లీడ్స్‌గా, ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై, శిరీష్, లక్ష్మణ్, హర్షిత్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా.. ‘V’.. నాని నటిస్తున్న 25వ సినిమా ఇది. సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్‌గా, నాని విలన్‌గా కనిపించనున్నారని సమాచారం. రీసెంట్‌గా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు..
షేక్ స్పియర్ కొటేషన్‌తో.. ‘ఈ క్షణం నుంచి నా శత్రువులకి నా దయా దాక్షిణ్యాలే దిక్కు’ అన్నాడు విలియమ్ షేక్ స్పియరుడు. ఆల్ ఎనిమీస్… బివేర్.. వచ్చే ఉగాది నుంచి ఆట, వేట మెుదలు’ అంటూ రెండు చేతులతో రెండు గన్స్ పట్టుకుని ఉన్న పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ వ్యక్తి ఎవరు అనేది మాత్రం రివీల్ చేయలేదు. ఉగాది కానుకగా 2020 మార్చి 25న ‘వి’ విడుదల కానుంది.
Read Also : ‘ఓ మనిషి నీవెవరు’ డిసెంబర్‌లో విడుదల
‘అష్టా-చమ్మా’, ‘జెంటిల్‌మన్’ సినిమాలతో నానికి, ‘సమ్మోహనం’తో సుధీర్ బాబుకి మంచి హిట్ సినిమాలు ఇచ్చిన ఇంద్రగంటి, ఇద్దరితో కలిపి ఎలాంటి సినిమా తీస్తాడోనని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘జెంటిల్‌మన్’, ‘నిన్నుకోరి’ సినిమాల తర్వాత నానితో నివేదా నటిస్తున్న మూడవ సినిమా ఇది. ‘సమ్మోహనం’ తర్వాత సుధీర్‌తో అదితి చేస్తున్న రెండవ సినిమా కూడా ఇదే కావడం విశేషం. ఈ సినిమాకి కెమెరా : పిజి విందా, ఎడిటింగ్ : మార్తాండ్ కె.వెంకటేష్, సంగీతం : అమిత్ త్రివేది.
“ఈ క్షణం నుంచి నా శత్రువులకి నా దయా దాక్షిణ్యాలే దిక్కు,” అన్నాడు విలియమ్ షేక్ స్పియరుడు. ఆల్ ఎనిమీస్… బివేర్? వచ్చే ఉగాది నుంచి ఆట, వేట మెుదలు??#VtheMovie @SVC_official @NameisNani @isudheerbabu @i_nivethathomas @aditiraohydari pic.twitter.com/16rMNolcN6
— Mohan Indraganti (@mokris_1772) November 4, 2019