వడివేలు ‘యమలోకం’.. స్పెషల్ సాంగ్ లో శ్రియ

  • Published By: veegamteam ,Published On : April 5, 2019 / 05:11 AM IST
వడివేలు ‘యమలోకం’.. స్పెషల్ సాంగ్ లో శ్రియ

Updated On : April 5, 2019 / 5:11 AM IST

తమిళ హాస్యనటుడు వడివేలు ఇంద్రుడు, యముడు, నరుడు పాత్రలను పోషించిన ‘ఇంద్రలోకత్తిల్ నా అళగప్పన్’ చిత్రాన్ని నిర్మాత కె.వి.రావు ‘యమలోకం’ పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు. ‘ఇంద్రలోకంలో సుందరవదన’ దీనికి ట్యాగ్‌లైన్‌. తంబి రామయ్య దర్శకుడు. ఈ సందర్బంగా నిర్మాత మాట్లాడుతూ ‘‘ఇప్పటి వరకూ యమలోకం బ్యాక్‌డ్రాప్‌లో చాలా సినిమాలు వచ్చాయి. కానీ ‘యమలోకం’ వాటన్నింటికంటే భిన్నంగా ఉంటుంది. రెండున్నర గంటలసేపు ప్రేక్షకుడు ఈ లోకాన్ని మరపించేలా మా సినిమా ఉంటుంది’’ అంటున్నారు కె.వి. రావు. 

ఈ మూవీలో నారదుడిగా నాజర్‌ నటించారు. హీరోయిన్‌ శ్రియ ఓ స్పెషల్ సాంగ్ తో కనువిందు చేస్తారు. తెలుగులో ఎప్పుడో విడుదల కావాల్సిన సినిమా ఇది. కొన్ని కారణాల వల్ల విడుదల కాలేదు. త్వరలో రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. డబ్బింగ్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి అని తెలిపారు.