Vaishnavi Chaitanya : బిగ్‌బాస్ కి అస్సలు వెళ్ళను.. షన్ను దొరకనంతగా బిజీ అయిపోయాడు..

వైష్ణవి చైతన్య మాట్లాడుతూ.. ''ప్రస్తుతం హీరోయిన్ గా బేబీ సినిమా చేస్తున్నాను. నేను బిగ్‌బాస్‌కు ఎందుకు వెళ్తాను. సినిమా పూర్తయ్యాక కూడా బిగ్‌బాస్‌ షోకు వెళ్లే ప్రసక్తే లేదు......

Vaishnavi Chaitanya : బిగ్‌బాస్ కి అస్సలు వెళ్ళను.. షన్ను దొరకనంతగా బిజీ అయిపోయాడు..

Vaishnavi Chaitanya

Updated On : July 16, 2022 / 3:09 PM IST

Shanmukh Jaswanth :  షార్ట్ ఫిలిమ్స్ తో గుర్తింపు తెచ్చుకొని సాంగ్ ఆల్బమ్స్, వెబ్ సిరీస్ లతో బాగా పాపులర్ అయింది వైష్ణవి చైతన్య. వీటితో వచ్చిన ఫేమ్ తో పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తుంది. ఇప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది. ఆనంద్ దేవరకొండ సరసన బేబీ సినిమాలో నటిస్తోంది. దీంతో బాగా బిజీ అయిపోయింది వైష్ణవి. వైష్ణవి గతంలో షణ్ముఖ్ తో సాఫ్ట్‌వేర్ డెవలపర్ సిరీస్ చేసింది. ఈ సిరీస్ బాగా పాపులర్ అవ్వడంతో వైష్ణవికి మంచి పేరు వచ్చింది.

ప్రస్తుతం షణ్ముఖ్ మెయిన్ లీడ్ లో ఏజెంట్ ఆనంద్ సంతోష్ అనే వెబ్ సిరీస్ ని ఆహాలో చేస్తున్నాడు. త్వరలోనే ఈ సిరీస్ రిలీజ్ కానుంది. తాజాగా శుక్రవారం సాయంత్రం ఈ సిరీస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగడంతో పలువురు సినీ, యూట్యూబ్ ప్రముఖులు విచ్చేశారు. ఈ ఈవెంట్ కి వైష్ణవి చైతన్య కూడా రావడంతో మీడియాతో ముచ్చటిస్తూ పలు ఆసక్తికర విషయాలని తెలిపింది. బిగ్ బాస్ కి వెళ్తుంది అనే రూమర్స్ పై కూడా మాట్లాడింది వైష్ణవి.

The South Swag : ఇండియా టుడే మ్యాగజైన్ పై అల్లు అర్జున్.. సౌత్ సినిమాలపై స్పెషల్ స్టోరీ..

వైష్ణవి చైతన్య మాట్లాడుతూ.. ”ప్రస్తుతం హీరోయిన్ గా బేబీ సినిమా చేస్తున్నాను. నేను బిగ్‌బాస్‌కు ఎందుకు వెళ్తాను. సినిమా పూర్తయ్యాక కూడా బిగ్‌బాస్‌ షోకు వెళ్లే ప్రసక్తే లేదు. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నాను. ఇక షన్ను చాలా బిజీ అయిపోయాడు. కలవడానికి కూడా దొరకట్లేదు. ఇలా బిజీ అవ్వడం మంచి విషయమే. ఇద్దరం కెరీర్లో ముందుకు వెళ్తున్నాం” అని తెలిపింది.