Vaishnavi Chaitanya : ‘బేబీ’ సినిమాలో బోల్డ్ సీన్స్ పై స్పందించిన వైష్ణవి చైతన్య.. ఏమందో తెలుసా?

బేబీ సినిమా రెండు రోజుల్లోనే 14 కోట్లు కలెక్ట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వైష్ణవి చైతన్య మాట్లాడుతూ ఈ సినిమాలో బోల్డ్ సీన్స్ పై స్పందించింది.

Vaishnavi Chaitanya : ‘బేబీ’ సినిమాలో బోల్డ్ సీన్స్ పై స్పందించిన వైష్ణవి చైతన్య.. ఏమందో తెలుసా?

Vaishnavi Chaitanya comments on Bold scenes in Baby Movie

Vaishnavi Chaitanya :  ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya), విరాజ్ అశ్విన్ (Viraj Ashwin), ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘బేబీ’. SKN నిర్మాణంలో సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన బేబీ సినిమా జులై 14న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయింది. మొదటి ఆట నుంచే ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకొని భారీ విజయం సాధించింది. కలెక్షన్స్ కూడా భారీగా అరాబాదుతుంది. బేబీ సినిమా రెండు రోజుల్లోనే 14 కోట్లు కలెక్ట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది.

ఇక ఈ సినిమా యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ తో ఈ సినిమా తెరకెక్కించారు. ఇందులో పలు సన్నివేశాలు బాగా కనెక్ట్ అవ్వడంతో రెండు రోజుల నుంచి సోషల్ మీడియా అంతా బేబీ సినిమా హడావిడి నడుస్తుంది. ఇక ఈ సినిమాలో బోల్డ్ సీన్స్ కూడా ఉన్నాయి. హీరోయిన్ వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ కి మధ్య లిప్ కిస్, రొమాన్స్ సీన్స్ ఉన్నాయి. ఇన్నాళ్లు చాలా పద్దతిగా కనిపించి, షార్ట్ ఫిలిమ్స్, సిరీస్ లలో కూడా మంచి క్యారెక్టర్స్ చేసి సడెన్ గా వైష్ణవి ఇలా బోల్డ్ క్యారెక్టర్ చేయడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.

చిత్రయూనిట్ ప్రస్తుతం సక్సెస్ సెలబ్రేషన్స్ లో మునిగిపోయింది. సక్సెస్ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు చిత్రయూనిట్. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వైష్ణవి చైతన్య మాట్లాడుతూ ఈ సినిమాలో బోల్డ్ సీన్స్ పై స్పందించింది. వైష్ణవి చైతన్య మాట్లాడుతూ.. ఒక సినిమాలో రొమాన్స్, లిప్ కిస్ సీన్స్ లో నటించడం చాలా కష్టం. ఈ విషయంలో బేబీ టీం నన్ను చాలా కంఫర్ట్ గా చూసుకున్నారు. ఆ సీన్ చేసే రోజు సెట్ లో చాలా తక్కువమంది ఉండేలా చూసుకున్నారు. విరాజ్ కూడా ఇప్పటిదాకా యాక్టింగ్ చేశాం. ఇది కూడా యాక్టింగ్ అంతే అంటూ సపోర్ట్ చేశాడు. సన్నివేశంలో భాగంగా చూసే చేశాను. కానీ సినిమా మొత్తంగా చూస్తే ఆ సీన్స్ గుర్తుండవు అని తెలిపింది.

Vishal : మొదటి సారి తెలుగులో పాట పాడిన విశాల్.. ‘మార్క్ ఆంటోని’ నుంచి ‘అదరద గుండె’ లిరికల్ సాంగ్ రిలీజ్..

ఇక ఈ సీన్స్ పై వైష్ణవి తల్లి తండ్రులు ఏమన్నారు అని అడగగా.. వాళ్ళు నాకు చిన్నప్పట్నుంచి ఫ్రీడమ్ ఇచ్చారు. నేను తప్పు, రైట్ జడ్జి చేయగలను అని వాళ్ళు నమ్మరు. బేబీ సినిమాని వాళ్ళు ఒక ఆడియన్స్ గా చూశారు. వాళ్ళకి మనసులో ఏమన్నా ఉందేమో నాకు తెలీదు, కానీ నా దగ్గర మాత్రం ఈ సీన్స్ గురించి మాట్లాడలేదు. వాళ్ళు ఆ సీన్స్ ని పట్టించుకోలేదు. సినిమా మొత్తం చూసి అభినందించారు అని తెలిపింది.