Vaishnavi Chaitanya : అదిరిపోయే ఆఫర్‌ అందుకున్న బేబీ.. ఏకంగా సూపర్ హిట్ సీక్వెల్‌లో హీరోయిన్‌గా..

బేబీ మూవీలో తన యాక్టింగ్ తో స్టార్ హీరోలు, దర్శకనిర్మాతలను ఆకట్టుకున్న వైష్ణవి.. తాజాగా ఒక స్టార్ హీరో పక్కన, ఒక సూపర్ హిట్ సీక్వెల్ లో హీరోయిన్ గా ఛాన్స్ అందుకున్నట్లు తెలుస్తుంది.

Vaishnavi Chaitanya : అదిరిపోయే ఆఫర్‌ అందుకున్న బేబీ.. ఏకంగా సూపర్ హిట్ సీక్వెల్‌లో హీరోయిన్‌గా..

Vaishnavi Chaitanya get chance in Ram Pothineni Double Ismart movie

Updated On : August 3, 2023 / 5:46 PM IST

Vaishnavi Chaitanya : తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్య.. షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ అంటూ యాక్టింగ్ కెరీర్ స్టార్ చేసింది. సినిమా అంటే ఇష్టంతో ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఇండస్ట్రీలో తనని తాను నిరూపించుకుంది. షార్ట్ సిరీస్ తో గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవి కొన్ని పెద్ద సినిమాల్లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసింది. ఇక హీరోయిన్ గా వైష్ణవి చేసిన ఫస్ట్ సిల్వర్ స్క్రీన్ మూవీ బేబీ (Baby). ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. 15 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా నేడు 75 కోట్లకు పైగా అందుకొని ముందుకు దూసుకుపోతుంది.

Jailer : రజినీకాంత్ జైలర్ మూవీ.. ఆ సినిమాకి ఫ్రీమేక్ అంటా.. ట్రైలర్స్ కూడా దాదాపు సేమ్..

థియేటర్స్ వద్ద ఈ సినిమాకి వస్తున్న ఆదరణ చూస్తుంటే.. లాంగ్ రన్ లో ఈ సినిమా 100 కోట్లు అందుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు సినీ విశ్లేషకులు. కాగా మొదటి సినిమాలోనే ఒక ఛాలెంజింగ్ రోల్ చేసి వైష్ణవి అందర్నీ ఆకట్టుకుంది. సినిమాలో తన యాక్టింగ్ చూసి స్టార్ హీరోలు, దర్శకనిర్మాతలు కూడా ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలోనే ఆమెకు ఛాన్సులు కూడా ఇస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే వైష్ణవికి అల్లు అరవింద్ గీతాఆర్ట్స్ లో ఒక సినిమా ఆఫర్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

OMG2 Trailer : ఓ మై గాడ్ 2 ట్రైలర్ రిలీజ్.. అక్షయ్ శివుడి పాత్ర చేయడం లేదు.. సెన్సార్ బోర్డు ఆదేశం..

తాజాగా ఇప్పుడు ఒక స్టార్ హీరో పక్కన, ఒక సూపర్ హిట్ సీక్వెల్ లో హీరోయిన్ గా ఛాన్స్ అందుకున్నట్లు తెలుస్తుంది. హీరో రామ్, పూరీజగన్నాధ్ కలయికలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సూపర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు దానికి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ (Double Ismart) ని సిద్ధం చేస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ కూడా మొదలైంది. బేబీ మూవీలోని వైష్ణవి యాక్టింగ్ చూసి పూరి ఫిదా అయ్యి ఈ సీక్వెల్ లో ఒక హీరోయిన్ పాత్ర కోసం వైష్ణవిని తీసుకున్నాడట. ఇటీవల రామ్ కూడా వైష్ణవికి పుష్పగుచ్ఛాన్ని పంపించి బేబీ సక్సెస్ కి కంగ్రాట్యులేట్ చేశాడు. దీంతో ఇప్పుడు ఈ వార్త నిజమనేలా ఉంది.