Varalaxmi Sarathkumar : టాలీవుడ్‌‌ని వణికిస్తున్న కరోనా.. వరలక్ష్మి శరత్ కుమార్‌కి పాజిటివ్

టాలీవుడ్ లో విలన్ తో పాటు విలక్షణ పాత్రలు పోషిస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ కు కరోనా సోకింది. ఇటీవలే బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో............

Varalaxmi Sarathkumar : టాలీవుడ్‌‌ని వణికిస్తున్న కరోనా.. వరలక్ష్మి శరత్ కుమార్‌కి పాజిటివ్

Varalaxmi

Updated On : January 7, 2022 / 11:00 AM IST

Varalaxmi Sarathkumar :  ఇటీవల రోజు రోజుకి మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ సారి సెలబ్రిటీలని గట్టిగానే టార్గెట్ చేసింది కరోనా. సెకండ్ వేవ్ కంటే కూడా ఈ సారి ఎక్కువ మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే చాలా మంది బాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్స్ కరోనా బారిన పడ్డారు. ఇక టాలీవుడ్ లోను చాలా మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే మంచు మనోజ్, మంచు లక్ష్మి, విష్వక్సేన్, మహేష్ బాబు, నితిన్ వైఫ్… ఇలా చాలా మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. తాజాగా మరో హీరోయిన్ కి కరోనా సోకింది.

Bangarraju : నాగార్జునపై సీరియస్.. ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్న ‘బాయ్‌కాట్ బంగార్రాజు’..

కోలీవుడ్ లో హీరోయిన్ గా, టాలీవుడ్ లో విలన్ తో పాటు విలక్షణ పాత్రలు పోషిస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ కు కరోనా సోకింది. ఇటీవలే బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో లేడీ విలన్ పాత్ర కోసం వరలక్ష్మిని తీసుకున్నారు. అంతే కాక వరలక్ష్మి ఓటీటీ కోసం చేయబోయే మరో తెలుగు సినిమా కూడా షూటింగ్ ప్రారంభమవ్వాల్సి ఉంది. వీటి కోసం ఇటీవల హైదరాబాద్ వచ్చింది. హైదరాబాద్ కి రాగానే పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలడంతో ప్రస్తుతం ఇక్కడే ఉండి చికిత్స తీసుకుంటున్నారు.