Sabari : థియేటర్లో రిలీజయిన అయిదు నెలల తర్వాత ఓటీటీలోకి.. వరలక్ష్మి సినిమా..
శబరి సినిమా మే 3న థియేటర్స్ లో రిలీజయింది. ఇప్పుడు అయిదు నెలల తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి వస్తుంది.

Varalaxmi Sarathkumar Sabari Movie OTT Streaming Details Here
Sabari Movie : వరలక్ష్మీ శరత్ కుమార్ ఇటీవల లేడీ ఓరియెంటెడ్ సినిమా ‘శబరి’తో ముందుకి వచ్చింది. మహా మూవీస్ బ్యానర్ పై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మాణంలో అనిల్ కాట్జ్ దర్శకత్వంలో తెరకెక్కిన శబరి సినిమా మే 3న థియేటర్స్ లో రిలీజయింది. ఇప్పుడు అయిదు నెలల తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి వస్తుంది.
Also Read : Rana Daggubati : ఆ హీరో – హీరోయిన్‌కి ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ చేసిన రానా.. సినిమా ఓపెనింగ్ లో సందడి..
అక్టోబర్ 11న శబరి సినిమా sunNXT ఓటీటీలో 5 భాషల్లో విడుదల కాబోతుంది. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
ఈ సందర్భంగా మూవీ నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల మాట్లాడుతూ.. కుటుంబం అంతా కలిసి కూర్చుని శబరి సినిమా చూడొచ్చు. ఇది స్ట్రాంగ్ ఎమోషనల్ థ్రిల్లర్. వరలక్ష్మీ శరత్ కుమార్ గారితో ఈ సినిమా చేయడం సంతోషంగా ఉంది. ఆమె నటించిన సినిమాలకు ఇది డిఫరెంట్ గా ఉంటుంది. శబరి సినిమా 300 థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయగా మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు ఓటీటీలో ఈ సినిమాను చూడండి అని తెలిపారు.