మా నాన్న ఎవరో తెలిసికూడా నన్ను గదిలోకి రమ్మన్నారు – నా దగ్గర కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి.. వరలక్ష్మీ సెన్సేషనల్ కామెంట్స్..

సినీ పరిశ్రమలోని క్యాస్టింగ్ కౌచ్ గురించి తమిళనటి వరలక్ష్మీ శరత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేసింది..

  • Published By: sekhar ,Published On : March 2, 2020 / 07:42 AM IST
మా నాన్న ఎవరో తెలిసికూడా నన్ను గదిలోకి రమ్మన్నారు – నా దగ్గర కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి.. వరలక్ష్మీ సెన్సేషనల్ కామెంట్స్..

Updated On : March 2, 2020 / 7:42 AM IST

సినీ పరిశ్రమలోని క్యాస్టింగ్ కౌచ్ గురించి తమిళనటి వరలక్ష్మీ శరత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేసింది..

కోలీవుడ్ సీనియర్ నటుడు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మీ శరత్ కుమార్ క్యాస్టింగ్ కౌచ్ వివాదం గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేయడం చిత్రపరిశ్రమలో చర్చకు దారితీసింది. కెరీర్ ఆరంభంలో అవకాశాల కోసం దర్శక నిర్మాతలతో తనను అడ్జెస్ట్ అవమని ఉచిత సలహా ఇచ్చారంటూ ఆమె ఆరోపించింది.

తాజాగా ఓ ఇంటర్వూలో క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడితే అమ్మాయిలు అవకాశాలు కోల్పోతారు కదా అని ప్రశ్నించగా..  వరలక్ష్మీ ‘‘ముందు అమ్మాయిలు అలాంటి వాళ్లకి నో చెప్పడం నేర్చుకోవాలి.. పేరుకి స్టార్ కిడ్‌నే అయినా నేనూ ఈ సంఘటనలు ఎదుర్కొన్నాను. నేనెవరో తెలిసి కూడా నన్ను పడకగదికి రమ్మనారు. అవకాశం కోసం దర్శక నిర్మాతలతో అడ్జెస్ట్ కావాలని చెబితే.. అలాంటి అవకాశం నాకొద్దని చెప్పాను.. వాళ్లు మాట్లాడిన ఫోన్ కాల్ రికార్డ్స్ నా దగ్గర ఉన్నాయి..

అవి కనుక బయటపెడితే మామూలుగా ఉండదు.. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నా కాళ్ల మీద నేను నిలబడ్డాను. ఇటీవలే విజయవంతంగా 25 సినిమాలు పూర్తి చేసాను. మహిళలు తమని తాము సేవ్ చేసుకోవడానికి ఎప్పుడూ రెడీగా ఉండాలి’’ అని చెప్పుకొచ్చింది. మహిళల రక్షణకోసం, సమాజంలో వారిపై జరుగుతున్న అక్రమాలపై పోరడడానికి స్త్రీశక్తి పేరుతో ఒక ఆర్గనైజేషన్ నిర్వహిస్తోంది వరలక్ష్మీ..