Varun Tej: వరుణ్ తేజ్ తో నిహారిక మూవీ.. మెగా ముహూర్తం ఫిక్స్.. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కి ఛాన్స్
నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ లో నెక్స్ట్ సినిమా చేస్తున్న వరుణ్ తేజ్(Varun Tej).
Varun Tej doing his next movie under Niharika Konidela Pink Elephant Pictures
- అన్నతో సినిమా చేస్తున్న నిహారిక
- కమిటీ కుర్రోళ్ళు డైరెక్టర్ తో రా అండ్ రస్టిక్ మూవీ
- మార్చి 28న మెగా ముహూర్తం
Varun Tej; మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన తదుపరి ప్రాజెక్టుల విషయంలో స్పీడ్ పెంచారు. గతేడాది ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో సెన్సేషనల్ హిట్ అందుకున్న యువ దర్శకుడు యదు వంశీ దర్శకత్వంలో వరుణ్ తేజ్ తన కొత్త సినిమాను ప్రకటించారు. ఈ క్రేజీ కాంబినేషన్ మూవీకి సంబంధించి అఫీషియల్ అప్డేట్ వచ్చేసింది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై మెగా డాటర్ నిహారిక కొణిదెల ఈ సినిమాను నిర్మించనున్నారు.
Samuthirakani: విజయ్- త్రిష వివాదం.. ప్రైవేట్ వీడియో వైరల్.. క్లారిటీ ఇచ్చిన సముద్రఖని
ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా గ్రాండ్ ఓపెనింగ్, పూజా కార్యక్రమాలు మార్చి 28న అత్యంత వైభవంగా జరగనున్నాయి. దర్శకుడు యదు వంశీ తన తొలి సినిమాతో పల్లెటూరి వాతావరణాన్ని, స్నేహాన్ని వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించారు. అదే తరహాలో వరుణ్ తేజ్ సినిమాను కూడా పక్కా విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో, నేటివిటీ మిస్ కాకుండా ప్లాన్ చేసినట్లు సమాచారం. వరుణ్ తేజ్(Varun Tej) ప్రస్తుతం తన హారర్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ ‘కొరియన్ కనకరాజు’ షూటింగ్లో బిజీగా ఉన్నారు.
ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిన వెంటనే యదు వంశీ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. వరుణ్ తేజ్ తన కెరీర్లో వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ వస్తున్నారు, ఈసారి పల్లెటూరి నేపథ్యంలో సాగే కథతో రానుండటం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. నిహారిక కొణిదెల నిర్మాణంలో వరుణ్ తేజ్ నటించడం ఇదే తొలిసారి కావడంతో ఈ సినిమాపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. గ్రామీణ నేపథ్యంలో సాగే భావోద్వేగపూరితమైన డ్రామాగా ఈ చిత్రం ఉండబోతుందని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఇక త్వరలోనే ఈ సినిమాలో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను అధికారికంగా వెల్లడించనున్నారు.
