Gandeevadhari Arjuna : డాడీ వెనకే అబ్బాయి.. రెండు వారాల గ్యాప్‌లో చిరు, వరుణ్ సినిమాలు..

రెండు వారాల గ్యాప్‌లో చిరు, వరుణ్ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఇక మెగా ఫ్యాన్స్ కి పండగే. చిరంజీవి భోళా శంకర్ ఆగష్టు 11న వస్తుంటే..

Gandeevadhari Arjuna : డాడీ వెనకే అబ్బాయి.. రెండు వారాల గ్యాప్‌లో చిరు, వరుణ్ సినిమాలు..

Varun Tej Gandeevadhari Arjuna Chiranjeevi Bhola Shankar released in two weeks gap

Updated On : June 7, 2023 / 5:53 PM IST

Chiranjeevi – Varun Tej : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చివరిగా F3 సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ప్రస్తుతం ఈ హీరో గాండీవధారి అర్జున (Gandeevadhari Arjuna), VT13 చిత్రాల్లో నటిస్తున్నాడు. ప్రవీణ్ సత్తారు డైరెక్షన్‌లోతెరకెక్కుతున్న గాండీవధారి అర్జున సినిమా ముందుగా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి టైటిల్ అనౌన్స్‌మెంట్ తప్ప ఎటువంటి అప్డేట్ ని ఇవ్వలేదు. అయితే తాజాగా చిత్ర యూనిట్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసి అందర్నీ సర్‌ప్రైజ్ చేశారు.

Adipurush : చిరంజీవి గారు ఏంటి రామాయణంలో నటిస్తున్నావా? అని ప్రశ్నించారు..

ఈ సినిమాని ఆగష్టు 25న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంటుంది. సూటు బూటు వేసుకొని స్టైలిష్ లుక్ లో కనిపిస్తూనే చుట్టూ వెపన్స్ తో యాక్షన్ మోడ్ లో అదరగొడుతున్నాడు. జేమ్స్ బాండ్ తరహాలో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. కాగా ఈ మూవీ రిలీజ్ కి ముందు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సినిమా రిలీజ్ ఉంది. చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ (Bhola Shankar) సినిమా ఆగష్టు 11న రిలీజ్ కాబోతుంది.

Amitabh Bachchan : ఫ్యాన్స్ దగ్గరకి వచ్చేటప్పుడు అమితాబ్ చెప్పులు వేసుకోరు.. ఎందుకో తెలుసా?

ఈ మూవీ రిలీజ్ అయిన రెండు వారాలకి వరుణ్ గాండీవధారి అర్జునతో థియేటర్స్ లోకి దిగబోతున్నాడు. దీంతో రెండు వారాల గ్యాప్ లో చిరు, వరుణ్.. మెగా ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేయనున్నారు. కాగా గాండీవధారి అర్జున సినిమాని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకం పై బివిఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఏజెంట్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన సాక్షి వైద్య (Sakshi Vaidya) హీరోయిన్ గా నటిస్తుంది. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ యాక్షన్ మూవీతో వరుణ్ తేజ్ ఏ రేంజ్ సక్సెస్ ని అందుకుంటాడా చూడాలి.