Varun – Lavanya : వరుణ్ – లావణ్య ఎంగేజ్మెంట్ కన్‌ఫార్మ్.. మెగా టీం అఫిషియల్ నోట్!

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఈ నెల జూన్ 9న ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నారు అని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మెగా టీం నుంచి..

Varun – Lavanya : వరుణ్ – లావణ్య ఎంగేజ్మెంట్ కన్‌ఫార్మ్.. మెగా టీం అఫిషియల్ నోట్!

Varun Tej Lavanya Tripathi engagement is official confirmed now

Updated On : June 8, 2023 / 11:30 AM IST

Varun Tej – Lavanya Tripathi : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఈ నెల జూన్ 9న ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నారు అని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీని పై మెగా ఫ్యామిలీ నుంచి ఎటువంటి అనౌన్స్‌మెంట్ రాకపోవడంతో అభిమానులంతా క్లారిటీ లేక తికమకలో పడ్డారు. ఇప్పుడు మెగా టీం నుంచి ఒక క్లారిటీ వచ్చేసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) అభిమాని సంఘానికి చెందిన శివ చెర్రీ అనే అభిమాని ఒక నోట్ రిలీజ్ చేశాడు.

Adipurush : ఓం రౌత్, కృతి ముద్దు వ్యవహారం.. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు ఆగ్రహం..

కంగ్రాట్యులేషన్స్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అండ్ లావణ్య త్రిపాఠి అంటూ ఎంగేజ్మెంట్ డేట్ తో ఉన్న ఒక కార్డుని పోస్ట్ చేశాడు. ఇక మెగా ఫ్యామిలీతో చాలా దగ్గరగా ఉండే శివ చెర్రీ ఈ పోస్ట్ వెయ్యడంతో అభిమానులకు ఒక క్లారిటీ వచ్చేసింది. దీంతో ఫ్యాన్స్ అంతా వరుణ్ అండ్ లావణ్యకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక రేపు (జూన్ 9) జరగబోయే ఈ నిశ్చితార్ధ వేడుకని మెగా హీరోలు ఎంత ఘనంగా చేస్తారో, టాలీవుడ్ నుంచి ఎవరెవరు ఈ వేడుకకు హాజరవుతారు అని అందరిలో ఆసక్తి నెలకుంది.

Gandeevadhari Arjuna : డాడీ వెనకే అబ్బాయి.. రెండు వారాల గ్యాప్‌లో చిరు, వరుణ్ సినిమాలు..

కాగా వరుణ్ అండ్ లావణ్య మిస్టర్ (Mister), అంతరిక్షం అనే సినిమాల్లో కలిసి నటించారు. అంతరిక్షం సినిమా సమయం నుంచే వీరిద్దరూ క్లోజ్ అయ్యారని, ఆ తర్వాత లవ్ లో పడినట్లు సమాచారం. ఇక అప్పటి నుంచి సీక్రెట్ ప్రేమాయణం నడుపుతూ వస్తున్నారు. మెగా ఫ్యామిలీలో జరిగే కొన్ని ఫ్యామిలీ ఫంక్షన్స్ కి లావణ్య హాజరయ్యేదని వార్తలు కూడా వచ్చేవి.