Varun Tej – Lavanya Tripathi : హిమాచల్‌ప్రదేశ్‌లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న మెగా కపుల్.. పర్వతాలు అధిరోహించి..

హిమాచల్‌ప్రదేశ్‌లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న మెగా కపుల్. పర్వతాలు అధిరోహించి కపుల్ గోల్స్ ని పర్ఫెక్ట్ గా ఎంజాయ్ చేస్తున్నారు.

Varun Tej – Lavanya Tripathi : హిమాచల్‌ప్రదేశ్‌లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న మెగా కపుల్.. పర్వతాలు అధిరోహించి..

Varun Tej Lavanya Tripathi enjoying vacation at himachal pradesh

Updated On : March 25, 2024 / 6:32 PM IST

Varun Tej – Lavanya Tripathi : టాలీవుడ్ మెగా కపుల్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి తమ మ్యారేజ్ లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఒక పక్క తమ వర్క్ చూసుకుంటూనే.. మరోపక్క కపుల్ గోల్స్ ని కూడా ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు. పెళ్లి తరువాత ఫారిన్ కి వెకేషన్ కి వెళ్లిన ఈ మెగా జంట.. ఆ తరువాత కాశ్మీర్ కి కూడా వెళ్లి అక్కడ సరదాగా ఎంజాయ్ చేసి వచ్చారు. ఈ రెండు వెకేషన్స్ మధ్యలో తమ వర్క్స్ ని కూడా చేస్తూ వచ్చారు.

ఇక ఇటీవల మళ్ళీ వర్క్ నుంచి కొంచెం గ్యాప్ తీసుకోని వెకేషన్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ జంట.. హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నారు. గత వారం రోజుల నుంచి అక్కడే ప్రకృతి అందాలు మధ్య గడుపుతూ వస్తున్నారు. పర్వతాలు అధిరోహించి సూర్యాస్తమయం చూస్తూ కపుల్ గోల్స్ ని పర్ఫెక్ట్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈ వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను వరుణ్, లావణ్య తమ సోషల్ మీడియాలో షేర్ చేసారు.

Also read : Venkatesh : తిరుమలలో దగ్గుబాటి కొత్త జంట.. వెంకటేష్ కూతురు అల్లుడి వీడియో వైరల్..

 

View this post on Instagram

 

A post shared by Varun Tej Konidela (@varunkonidela7)

వరుణ్ తేజ్ సినిమాల విషయానికి వస్తే.. చివరిగా ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాతో వచ్చారు. రియల్ ఇన్సిడెంట్స్ తో వచ్చిన ఈ చిత్రం విమర్శల ప్రశంసలు అందుకుందే గాని, కమర్షియల్ గా పెద్దగా వర్క్ అవుట్ అవ్వలేదు. అంతకుముందు వచ్చిన ‘గాండీవధారి అర్జున’ కూడా ప్లాప్ గా నిలిచింది. దీంతో వరుణ్ ప్రస్తుతం సరైన సక్సెస్ లేక ఉన్నారు. ప్రెజెంట్ ఈ హీరో ‘మట్కా’ అనే మూవీ చేస్తున్నారు.

కరుణకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం.. 1960 బ్యాక్‌డ్రాప్‌తో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతుంది. ఈ సినిమా కూడా రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగానే రూపొందుతున్నట్లు సమాచారం. గ్యాబ్లింగ్ మార్కెట్ లో కింగ్‌లా ఎదిగిన ‘రతన్ ఖత్రి’ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందుతుందని టాక్ వినిపిస్తుంది. మరి అది ఎంత వరకు నిజమో తెలియదు.