Varun Lavanya : వరుణ్ లావణ్య ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్.. ఫోటోలు షేర్ చేసిన మెగాస్టార్..

వరుణ లావణ్య పెళ్లి అక్టోబర్ చివర్లో లేదా నవంబర్ లో ఉండొచ్చని సమాచారం. నిన్న రాత్రి వరుణ్ లావణ్య ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి.

Varun Lavanya : వరుణ్ లావణ్య ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్.. ఫోటోలు షేర్ చేసిన మెగాస్టార్..

Varun Tej Lavanya Tripathi Pre Wedding Celebrations with Families Chiranjeevi Shares Photos

Varun Lavanya : మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej) ఇటీవల హీరోయిన్ లావణ్య త్రిపాఠిని(Lavanya Tripathi) నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు ఆరేళ్లుగా ఎవరికీ తెలియకుండా ప్రేమించుకుంటూ సడెన్ గా నిశ్చితార్థం చేసుకొని అందర్నీ ఆశ్చర్యపోయారు. మెగా ఫ్యామిలీ, లావణ్య ఫ్యామిలీ మధ్యే ఈ నిశ్చితార్థం జరిగింది. మెగా అభిమానులు వరుణ్ పెళ్లిపై సంతోషం వ్యక్తం చేస్తూ ఎప్పుడు చేసుకుంటారా అని చూస్తున్నారు.

ఇటీవలే బాలీవుడ్ ఫేమస్ డిజైనర్ మనీష్ మల్హోత్రా వద్దకు వెళ్లి తమ పెళ్లి బట్టలు కూడా డిజైనింగ్ కి ఆర్డర్ ఇచ్చారు. వరుణ లావణ్య పెళ్లి అక్టోబర్ చివర్లో లేదా నవంబర్ లో ఉండొచ్చని సమాచారం. నిన్న రాత్రి వరుణ్ లావణ్య ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. ఈ ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ కి చరణ్, ఉపాసన, వైష్ణవ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్.. ఇలా మెగా ఫ్యామిలీ, లావణ్య ఫ్యామిలీ, అల్లు ఫ్యామిల మధ్య ఈ సెలబ్రేషన్స్ జరిగాయి.

Varun Tej Lavanya Tripathi Pre Wedding Celebrations with Families Chiranjeevi Shares Photos

Also Read : Boyapati Srinu : బాబోయ్ బోయపాటి లైనప్ చూశారా.. సూర్య, బన్నీ, మహేష్.. ఇన్ని సినిమాలా?

తాజాగా మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) వరుణ్ లావణ్య ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఫోటోలు తన ట్విట్టర్ లో షేర్ చేశారు. దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. అభిమానులు ఈ ఫోటోల కింద కామెంట్స్ పెడుతూ వీరి పెళ్లి కోసం ఎదురు చూస్తున్నట్టు తెలుపుతున్నారు. మరి ఈ ప్రేమ జంట ఎప్పుడు పెళ్లి పీటలు ఎక్కనుందో చూడాలి.