అనిల్ రావిపూడి అరెస్ట్

అనిల్ రావిపూడి అరెస్ట్ -ఫన్నీ పిక్ షేర్ చేసిన వరుణ్ తేజ్.

  • Published By: sekhar ,Published On : February 1, 2019 / 12:09 PM IST
అనిల్ రావిపూడి అరెస్ట్

Updated On : February 1, 2019 / 12:09 PM IST

అనిల్ రావిపూడి అరెస్ట్ -ఫన్నీ పిక్ షేర్ చేసిన వరుణ్ తేజ్.

విక్టరీ వెంకటేష్, మెగాప్రిన్స్‌వరుణ్ తేజ్ హీరోలుగా, మిల్కీబ్యూటీ తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై, అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో, ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఎఫ్2, సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి, సూపర్ హిట్ టాక్‌తో, హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకెళ్తుంది. బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ, ఆడియన్స్‌ని నవ్వుల్లో ముంచెత్తిన డైరెక్టర్ అనిల్ రావిపూడి అరెస్ట్ అయ్యాడు. వరుణ్ తేజ్, అనిల్‌ని అరెస్ట్ చేసాడు.. వరుణ్ ఏంటి, అనిల్‌ని అరెస్ట్ చెయ్యడమేంటి అని కన్ఫ్యూజ్ అవుతున్నారా?

రీసెంట్‌గా వరుణ్, అనిల్ చేతికి బేడీలు వేస్తున్న ఫోటోని షేర్ చేస్తూ, అతిగా నవ్వించినందుకు అనిల్‌ని అరెస్ట్ చేస్తున్నా అంటూ, ఎఫ్2 షూటింగ్ టైమ్‌లో, షాట్ గ్యాప్‌లో సరదాగా తీసుకున్న పిక్‌ని పోస్ట్ చేసాడు.. అదీ, అసలు సంగతి..  నాలుగవ వారంలోకి ఎంటరైన ఎఫ్2, ఇప్పటికే రూ.75 కోట్ల షేర్ మార్క్ దాటేసింది. ఇతర భాషల్లోనూ ఈ సినిమాని రీమేక్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. అనిల్ డైరెక్షన్‌లోనే, ఎఫ్3 కూడా రాబోతుంది.