Veera Simha Reddy: ఈసారి రొమాంటిక్‌గా వస్తున్న బాలయ్య.. రెండో సింగిల్ సాంగ్‌కు టైమ్ ఫిక్స్!
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’ మరో నెల రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండగా, పూర్తి ఫ్యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్య పాత్రను పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దారు చిత్ర యూనిట్.
Veera Simha Reddy: నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’ మరో నెల రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండగా, పూర్తి ఫ్యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్య పాత్రను పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దారు చిత్ర యూనిట్.
Veera Simha Reddy: వీరసింహారెడ్డి రన్‌టైమ్ ఫిక్స్.. ఎంతో తెలుసా?
ఇక ఈ సినిమా నుండి తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. ఈ సినిమాలోని రెండో సింగిల్ సాంగ్‌ను డిసెంబర్ 15న ఉదయం 9.42 గంటలకు రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ పాట పూర్తి రొమాంటిక్ సాంగ్‌గా రాబోతున్నట్లు తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. అందాల భామ శ్రుతి హాసన్‌తో కలిసి బాలయ్య అదిరిపోయే స్టెప్స్ వేస్తున్నట్లు ఈ పోస్టర్లో కనిపిస్తుంది.
Veera Simha Reddy : తన ‘సుగుణ సుందరి’ని అప్పుడే పరిచయం చేస్తానంటున్న బాలయ్య..
థమన్ సంగీతం అందిస్తున్న ‘వీరసింహారెడ్డి’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య రెండు వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తుండగా.. దునియా విజయ్, వరలక్ష్మీ శరత్ కుమార్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.