VeeraSimha Reddy : బాలయ్య అభిమానులకు నిరాశ.. వీరసింహుని 100 రోజుల విజయోత్సవం వాయిదా
బాలయ్య సొంత నియోజకవర్గమైన హిందూపురంలో ఏప్రిల్ 23న 100 రోజుల వేడుకలు గ్రాండ్ గా నిర్వహిస్తామని మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించారు. దీంతో అభిమానులంతా ఈ వేడుక కోసం ఎదురుచూస్తున్నారు.

VeeraSimha Reddy 100 days function in Hindupuram Postponed
VeeraSimha Reddy : బాలకృష్ణ(Balakrishna) హీరోగా, శృతి హాసన్(Shruthi Hassan), హానీరోజ్(Honey Rose) హీరోయిన్స్ గా గోపీచంద్ మలినేని(Gopichand Malineni) దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers) నిర్మాణంలో తెరకెక్కిన సినిమా వీరసింహారెడ్డి(VeeraSimha Reddy). సంక్రాంతికి(Sankranthi) రిలీజయిన ఈ సినిమా యాక్షన్, మాస్, సిస్టర్ సెంటిమెంట్స్ తో ప్రేక్షకులని, అభిమానులని అలరించి భారీ విజయం సాధించింది. అఖండ సినిమా తర్వాత బాలకృష్ణ ఈ సినిమాతో మరోసారి 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేశాడు. దీంతో బ్యాక్ టు బ్యాక్ బాలయ్య రెండు భారీ విజయాలు సాధించడంతో అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు.
వీరసింహారెడ్డి సినిమా 100 రోజుల వేడుకలు చేస్తామంటూ ఇటీవల నిర్మాణ సంస్థ ప్రకటించింది. బాలయ్య సొంత నియోజకవర్గమైన హిందూపురంలో ఏప్రిల్ 23న 100 రోజుల వేడుకలు గ్రాండ్ గా నిర్వహిస్తామని మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించారు. దీంతో అభిమానులంతా ఈ వేడుక కోసం ఎదురుచూస్తున్నారు. బాలయ్య నియోజకవర్గం కావడంతో ఈ వేడుకలు మరింత గ్రాండ్ గా జరుగుతాయని భావించారు. కానీ తాజాగా ఈ వేడుకలు వాయిదా వేశామని ప్రకటించడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు.
హిందూపురం పట్టణంలో వీరసింహారెడ్డి సినిమా శతదినోత్సవ వేడుకలు నిర్వహిద్దామని చిత్ర నిర్మాణ సంస్థ భావించింది కానీ రంజాన్ పండుగ సందర్బంగా, అలాగే ఈనెల 26 తేదిన అనంతపురం జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటనలు ఉన్న కారణంగా సెక్యూరిటీ ప్రాభ్లమ్ ఇబ్బంది కారణంగా పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదని, అందుకే ఈ వేడుక తాత్కాలికంగా వాయిదాపడట్టు సమాచారం. హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమా శతదినోత్సవ వేడుకలు జరుగాతయని ఎదురు చూసిన అబిమానులకు నిరాశ మిగిలింది. దీంతో నేడు సాయంత్రం హిందూపురం పట్టణంలోని గురునాథ్ థియేటర్లో వీరసింహారెడ్డి శతదినోత్సవ వేడుకలు సింపుల్ గా నిర్వహించనున్నారు బాలయ్య అబిమానులు.