Venkatesh maha : వాళ్ళు అసలు మనుషులే కాదు.. హీరోల వ్యక్తిగత గ్లోరీ కోసం నేను పని చేయను.. వెంకటేష్ మహా సంచలన వ్యాఖ్యలు..

సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వెంకటేష్ మహా ఓ ఇంటర్వ్యూలో పలు సంచనలం వ్యాఖ్యలు చేశారు. గతంలో వెంకటేష్ మహా KGF సినిమాపై విమర్శలు చేయడంతో సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోల్స్ ఎదుర్కున్నాడు. ఇప్పుడు వాటికి కూడా సమాధానమిచ్చాడు.

Venkatesh maha : వాళ్ళు అసలు మనుషులే కాదు.. హీరోల వ్యక్తిగత గ్లోరీ కోసం నేను పని చేయను.. వెంకటేష్ మహా సంచలన వ్యాఖ్యలు..

Venkatesh maha Sensational Comments on His KGF Controversy and Tollywood Actors

Updated On : October 28, 2023 / 2:58 PM IST

Venkatesh maha : కేరాఫ్ కంచరపాలెం సినిమాతో డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు వెంకటేష్ మహా. ఆ తర్వాత ఓ రీమేక్ సినిమా తీశారు. ఆ తర్వాత యాక్టర్ గా పలు సినిమాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు మళ్ళీ అతని డైరెక్షన్ లో సినిమా రాలేదు. కానీ నిర్మాణంలో బిజీగానే ఉన్నాడు. వెంకటేష్ మహా నిర్మాణంలో సంపూర్ణేష్ బాబు హీరోగా మార్టిన్ లూథర్ కింగ్ సినిమా ఇటీవల రిలీజయింది. ఈ సినిమా తమిళ్ సినిమా మండేలాకు రీమేక్ గా తెరకెక్కింది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వెంకటేష్ మహా ఓ ఇంటర్వ్యూలో పలు సంచనలం వ్యాఖ్యలు చేశారు. గతంలో వెంకటేష్ మహా KGF సినిమాపై విమర్శలు చేయడంతో సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోల్స్ ఎదుర్కున్నాడు. ఇప్పుడు వాటికి కూడా సమాధానమిచ్చాడు.

వెంకటేష్ మహా KGF వివాదం గురించి మాట్లాడుతూ.. ఆ వివాదం ముందు కానీ, తర్వాత కానీ నాకు ఎలాంటి కాంట్రవర్సీలు లేవు. అది కూడా కొంతమంది సోషల్ మీడియాలో ఉండేవాళ్ళు చేశారు తప్ప బయట వాళ్ళెవరికీ తెలీదు. ఈ ప్రమోషన్స్ లో నేను చాలా మంది కలిశాను. ఎవ్వరూ దానికి గురించి మాట్లాడలేదు. సోషల్ మీడియాలో కొంతమంది చేసే హడావిడిని అస్సలు నేను పట్టించుకోను. నా దృష్టిలో వాళ్ళు అసలు మనుషులే కాదు. నేను పబ్లిసిటీ కోసం రాలేదు. నా కథలు చెప్పి సినిమాలు చేసుకోవడానికి వచ్చాను. అలాంటివి పట్టించుకోను అన్నారు.

Also Read : Suryakantham : తెరపై దడదడలాడించిన గుండమ్మకు.. తెర వెనుక ఎన్నో కష్టాలు.. గయ్యాళి అత్తగారికి వందేళ్లు..

అలాగే మొదటి సినిమా తర్వాత ఎందుకు చాలా గ్యాప్ వస్తుంది. చేసేవి ఎందుకు రీమేక్ సినిమాలే చేస్తున్నారు? ఒరిజినల్ కథలు లేవా అని అడగడంతో వెంకటేష్ మహా దీనికి సమాధానమిస్తూ.. నా దగ్గర కథలు ఉన్నాయి, కానీ వాటిని తీసేవాళ్ళు దొరకాలిగా. మర్మాణువు సినిమా కథని చాలా మందికి నాలుగు గంటల పాటు నేరేషన్ ఇచ్చాను. కథ బాగుంది అని పొగిడినా సినిమా తీయడానికి ముందుకు రాలేదు ఎవ్వరూ. నేనే క్రౌడ్ ఫండింగ్ ద్వారా సినిమా తీస్తున్నాను ఇప్పుడు. ఒక నటుడికి నేను లవ్ స్టోరీ చెప్తే.. పుష్ప లాంటి స్టోరీ కావలి అన్నాడు. ఒక నటుడికి యాక్షన్ సినిమా చెప్తే.. ఆయన దగ్గర ఉన్న రైటర్స్ అంతా వినీ KGF లా చేస్తారా అని అడిగారు. KGF చూసుకుంటే సరిపోతుంది కదా. అందుకే నేను సినిమాలు లేట్ గా తీస్తున్నాను. వాళ్ళ వ్యక్తిగత గొప్పతనాల కోసం నేను పనిచేయను. నా కష్టాలు, నా ఆలోచనలు, నా జీవితానుభవాల్లోంచి రాసుకున్న కథల్లో నేను కాంప్రమైజ్ అవ్వను అందుకే నా నుంచి ఒరిజినల్ సినిమాలు రావడానికి లేట్ అవుతుంది అని తెలిపారు. దీంతో వెంకటేష్ మహా చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.