‘వెంకీమామ’ దసరా శుభాకాంక్షలు
ప్రేక్షకులకు, అభిమానులకు, తెలుగు ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలుపుతూ.. వెంకీమామ న్యూ పోస్టర్ రిలీజ్ చేశారు మూవీ టీమ్..

ప్రేక్షకులకు, అభిమానులకు, తెలుగు ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలుపుతూ.. వెంకీమామ న్యూ పోస్టర్ రిలీజ్ చేశారు మూవీ టీమ్..
విక్టరీ వెంకటేష్, యువసామ్రాట్ నాగచైతన్య.. మామా అల్లుళ్ళుగా నటిస్తున్న ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్.. ‘వెంకీమామ’.. కేఎస్ రవీంద్ర (బాబీ) డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో వెంకీతో పాయల్ రాజ్‌పుత్, చైతుతో రాశీఖన్నా జతకడుతున్న సంగతి తెలిసిందే.
సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దసరా పండుగ సందర్భంగా వెంకీమామ న్యూ పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రేక్షకులకు, అభిమానులకు, తెలుగు ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలుపుతూ విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంటుంది. వెంకీ, చైతు, పాయల్, రాశీ ఖన్నా ట్రాక్టర్‌పై కూర్చుని ఉన్నారు.
Read Also : సాయి ధరమ్ తేజ్ హీరోగా ‘సోలో బ్రతుకే సో బెటర్’..
ఈ లుక్ అక్కినేని, దగ్గుబాటి ఫ్యాన్స్ ఫుల్ కిక్ ఇచ్చింది. అక్టోబర్ 8వ తేదీ ఉదయం 8గంటల 8 నిమిషాలకు వెంకీమామ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చెయ్యనున్నారు. సంగీతం : థమన్, కెమెరా : ప్రసాద్ మూరెళ్ల, ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి.