రాజమండ్రిలో వెంకీమామ సందడి

ఫిబ్రవరి 22నుండి.. రాజమండ్రి పరిసరాల్లో వెంకీమామ షూటింగ్ ప్రారంభం కాబోతుంది.

  • Published By: sekhar ,Published On : February 5, 2019 / 09:30 AM IST
రాజమండ్రిలో వెంకీమామ సందడి

Updated On : February 5, 2019 / 9:30 AM IST

ఫిబ్రవరి 22నుండి.. రాజమండ్రి పరిసరాల్లో వెంకీమామ షూటింగ్ ప్రారంభం కాబోతుంది.

విక్టరీ వెంకటేష్, యువసామ్రాట్ నాగచైతన్యల కాంబోలో, బాబీ డైరెక్షన్‌లో రూపొందుతున్న సినిమా, వెంకీమామ.. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందనున్న వెంకీమామ స్ర్కిప్ట్ వర్క్ కంప్లీట్ చేసుకుని, మరికొద్ది రోజుల్లో సెట్స్‌పైకి వెళ్ళనుంది. చైతన్యకి జోడీగా రకుల్ ప్రీత్ నటిస్తుండగా, వెంకీ సరసన శ్రియని హీరోయిన్‌గా ఫిక్స్ చేసారు. సుభాష్ చంద్రబోస్, తులసిలో స్పెషల్ సాంగ్, గోపాల గోపాల తర్వాత, వెంకీ, శ్రియ నటిస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. ఫిబ్రవరి 22నుండి.. రాజమండ్రి పరిసరాల్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుంది.

వెంకీమామ కోనసీమ బ్యాక్ డ్రాప్‌లో రూపొందబోయే సినిమా కావడంతో, షూటింగ్ కోసం రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాలని సెలెక్ట్ చేసుకున్నారు.. వెంకీ, ఇంతకుముందు చైతన్య ప్రేమమ్‌లో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చాడు. ఎఫ్2 సూపర్ హిట్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న వెంకీ, తన మేనల్లుడు చైతుతో కలిసి పూర్తిస్థాయిలో నటిస్తున్న సినిమా కావడంతో, వెంకీమామపై మంచి అంచనాలున్నాయి. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు.