Vennela Kishore : ఆ హీరోయిన్ కి వెన్నెల కిషోర్ కల్ట్ ఫ్యాన్ అంట.. ఆమె ఫోటో పెట్టగానే సీక్రెట్ గా..
ఈవెంట్లో వెన్నెల కిషోర్ మాట్లాడుతూ..

Vennela Kishore Tells about his Favorite Heroine in Single Trailer Launch Event
Vennela Kishore : మన సెలబ్రిటీలకు కూడా వాళ్లకు ఫేవరేట్ హీరోయిన్స్, హీరోలు ఉంటారు. ఏదో ఒక సందర్భంలో అది బయటపెడుతూ ఉంటారు. తన కామెడీతో సినిమాల్లో ఫుల్ గా నవ్వించే వెన్నెల కిషోర్ తాజాగా తను ఓ హీరోయిన్ కి కల్ట్ ఫ్యాన్ అని చెప్పడం వైరల్ గా మారింది.
శ్రీవిష్ణు హీరోగా నటించిన సింగిల్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నేడు జరిగింది. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన వెన్నెల కిషోర్ కూడా ఈవెంట్ కి హాజరయ్యాడు. ఈవెంట్లో వెన్నెల కిషోర్ మాట్లాడుతూ సినిమాకు పనిచేసిన వాళ్ళందరి గురించి మాట్లాడాడు.
అనంతరం వెన్నెల కిషోర్.. కొన్ని కొన్ని సినిమాలకు కల్ట్ ఫాలోయింగ్ ఉంటుంది. వాటి విషయంలో బయటపడరు. కేవలం ఆ సినిమాలు వచ్చినప్పుడు మాత్రం కలెక్షన్స్ ఇస్తారు. అలాంటి కల్ట్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ కేతిక శర్మ. ఆ ఫ్యాన్స్ లో నేను కూడా ఒకడ్ని. మనమందరం బయటకు చెప్పుకోము కానీ ఆమె ఫోటో పెట్టగానే వెంటనే సీక్రెట్ గా లైక్ చేస్తాము. తనతో పనిచేయడం నిజంగా గర్వంగా ఉంది అని తెలిపాడు. దీంతో కేతిక ఫ్యాన్స్ వెన్నెల కిషోర్ వ్యాఖ్యలను వైరల్ చేస్తున్నారు.
Also Read : #Single : శ్రీవిష్ణు ‘సింగిల్’ ట్రైలర్ వచ్చేసింది.. ట్రయాంగిల్ లవ్ స్టోరీతో కామెడీ అదరగొట్టారుగా..