హ్యాపీ బర్త్‌డే నరేష్- ‘నాంది’.. కొత్తగా ట్రై చేశాడు..

  • Published By: sekhar ,Published On : June 30, 2020 / 10:57 AM IST
హ్యాపీ బర్త్‌డే నరేష్- ‘నాంది’.. కొత్తగా ట్రై చేశాడు..

Updated On : June 30, 2020 / 5:07 PM IST

ఇన్నాళ్లు ‘అల్లరి’ నరేష్‌గా తెలుగు ప్రేక్షకులను తన కామెడీ టైమింగ్‌తో అలరించిన యంగ్ హీరో నరేష్ ఇప్పటినుండి తనలోని నటుణ్ణి బయటకుతీసే విలక్షణమైన పాత్రలతో Versatile Actor గా నిరూపించుకోవాలని డిసైడ్ అయ్యాడు. ఆ ప్రయత్నంలో భాగంగా ‘మహర్షి’ లో రవి గా ఆకట్టుకున్న నరేష్ కొంత గ్యాప్ తర్వాత తనకున్న కామెడీ ఇమేజ్‌ని పక్కన పెట్టేసి ‘నాంది’ అనే ఓ విభిన్నమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన నరేష్ పోస్టర్స్ కొత్తదనంతో ఆకట్టుకున్నాయి. జూన్ 30 నరేష్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేస్తూ ‘నాంది’ టీజర్ విడుదల చేశారు.

‘దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో 2015 నాటికి 1401 జైళ్లు ఉంటే 3,66,781 మంది ఖైదీలు రకరకాలుగా శిక్షలు అనుభవిస్తున్నారు.అందులో దాదాపుగా 2,50,000 మంది తప్పు చేశామో, చెయ్యలేదో తెలియకుండానే అండర్ ట్రైల్ ఖైదీలుగా శిక్ష అనుభవిస్తున్నారు’.. అనే వాయిస్ ఓవర్‌తో స్టార్ట్ అయిన ‘నాంది’ టీజర్ ఆసక్తికరంగా ఉంది. నరేష్ మేకోవర్ కొత్తగా ఉంది. తన ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకున్నాడు. టీజర్ చివర్లో ‘ఒక మనిషి పుట్టడానికి కూడా 9 నెలలే టైం పడుతుంది.. మరి నాకు న్యాయం చెప్పడానికి ఏంటి సార్ ఇన్ని సంవత్సరాలు పడుతుంది’ అంటూ నరేష్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది.

టీజర్లో సిద్ విజువల్స్, శ్రీ చరణ్ పాకాల బ్యాగ్రౌండ్ స్కోర్ హైలెట్ అయ్యాయి. వరలక్ష్మీ శరత్ కుమార్, ప్రియదర్శి, ప్రవీణ్, హరీష్ ఉత్తమన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విజయ్ కనకమేడలను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. ఎస్.వి. 2 ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సతీశ్ వేగేశ్న నిర్మిస్తున్న ఈ చిత్రానికి మాటలు: అబ్బూరి రవి, కెమెరా: సిద్, సంగీతం: శ్రీ చరణ్ పాకాల, ఎడిటర్: చోటా కె ప్రసాద్.

Read:‘నాంది’లో విభిన్నమైన క్యారెక్టర్స్ రివీల్..