Rashmika Mandanna : రష్మిక మేడం.. ఆ కార్ మనది కాదు.. కంగారుపడి రష్మిక ఏం చేసిందో తెలుసా?
తన కారుకి బదులు వేరొకరి కారు ఎక్కబోయారు నటి రష్మిక మందన్న. కాదని తెలుసుకునేలోపు కెమెరాలు ఊరుకుంటాయా? రష్మిక పడిన కన్ఫ్యూజన్‌ని క్యాప్చర్ చేసేసాయి.

Rashmika Mandanna
Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్న వరుస సినిమాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. యానిమల్ హిట్ తర్వాత హైదరాబాద్ టు ముంబయి చక్కెర్లు కొడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తన కారులో బదులు వేరొకరి కారులో ఎక్కి కూర్చోబోవడం కాదని తెలిసి కంగారు పడటం.. ఆ వీడియో కాస్తా నెట్టింట్లో వైరల్ అవడం జరిగిపోయింది.
Kalki 2898AD : ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ అప్పుడేనా? ఆ డేట్ బాగా కలిసొచ్చింది అని..
రష్మికకి ఇండియా వైడ్ ఫ్యాన్స్ ఉన్నారు. యానిమల్ సినిమా తర్వాత వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు ఈ నటి. ఇటీవల యానిమల్ సక్సెస్ మీట్‌లో పాల్గొనడానికి రష్మిక ముంబయి వెళ్లారు. ఈ క్రమంలోనే ఆమెతో సెల్ఫీ దిగాలని అభిమానులు వెంట పడ్డారు. ఫ్యాన్స్ చుట్టుముడుతున్న కంగారు.. తను త్వరగా బయలుదేరాలని హడావిడిలో కన్ఫ్యూజ్ అయిపోయిన రష్మిక తన కారు బదులు వేరొకరి కారు ఎక్కబోయారు. వెంటనే ఆమె టీమ్ ఆ కారు మనది కాదని చెప్పడంతో ఖంగు తిన్నారు. వెంటనే వేగంగా తన కారువైపు పరుగులు తీసారు. ఈలోపు ఫోటోలు అంటూ ఫ్యాన్స్ వెంటపడుతుంటే ఓ ఇద్దరితో ఫోటోలు దిగి అక్కడి నుండి బయలుదేరారు.
Pushpa 2 : పుష్ప 2 లో ఐటెం సాంగ్ చేయబోయేది ఎవరు? సమంతకి ఛాన్స్ లేనట్లేనా..?
రష్మికకి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రష్మిక ప్రస్తుతం వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ లో ‘ది గర్ల్ ఫ్రెండ్’ అనే మూవీ చేస్తున్నారు. ఇప్పటికే పుష్ప 2 లో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు.
View this post on Instagram