Nayan-Vignesh: సామ్-చై మాదిరే నయన్-విగ్నేష్ విడాకులు.. వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు!
స్టార్ హీరోయిన్ నయనతార, తమిళ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న సంగతి అందరికి తెలిసిందే. వీరిద్దరూ కలిసి సినిమాలు నిర్మిస్తున్నారు, బిజినెస్‌లు చేస్తున్నారు.

Nayan Vignesh
Nayan-Vignesh: స్టార్ హీరోయిన్ నయనతార, తమిళ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న సంగతి అందరికి తెలిసిందే. వీరిద్దరూ కలిసి సినిమాలు నిర్మిస్తున్నారు, బిజినెస్‌లు చేస్తున్నారు. ఇక గత కొంతకాలంగా వీరిద్దరూ కలిసి జీవిస్తున్నారు కూడా. ఈ లవ్‌బర్డ్స్ సరదాగా చెట్టాపట్టాలేసుకొని తిరిగేస్తున్నారు. నయన్, విగ్నేష్ కలిసి గత కొంతకాలంగా దేశంలోని ప్రముఖ ఆలయాలన్నీ తిరిగేస్తుండగా.. తాజాగా తిరుమల దర్శనానికి కూడా వచ్చారు. దీంతో వీళ్ళు పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయిందని ప్రచారం మొదలైంది.
Nayan-Vignesh: శ్రీవారి సాక్షిగా.. నయన్-శివన్ కథ శుభం కార్డు!
త్వరలోనే ఈ జంట తిరుమలలోనే పెళ్లి చేసుకోబోతున్నారని.. దానికి ఏర్పాట్ల కోసమే తిరుమల పర్యటనకి వచ్చారని కూడా లీకైపోయింది. అయితే.. శుభమా అని ఒక్కటి కావాలని చూస్తున్న ఈ జంట జాతక రీత్యా పెళ్లి చేసుకున్నా విడాకులతో దూరం కావాల్సిందేనని వేణు స్వామి అనే జ్యోతిస్కుడు సంచనల వ్యాఖ్యలు చేశారు. నయనతార, విఘ్నేష్ శివన్ వైవాహిక జీవితంను కొనసాగించలేక.. గొడవల కారణంగా విడిపోతారని జ్యోతిష్య శాస్త్రం చెబుతుందని చేసిన వ్యాఖ్యలు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Nayan-Vignesh: పెళ్లి పీటలేక్కబోతున్న నయన్.. ముహూర్తం ఎప్పుడంటే?
గతంలో సమంత, నాగ చైతన్య పెళ్లి సందర్బంలో కూడా వేణుస్వామి అలాంటి వ్యాఖ్యలే చేశారు. సామ్-చై విడాకుల సమయంలో ఈయన చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున వైరల్ కావడంతో ఇతను మళ్ళీ ఫోకస్ లోకి వచ్చారు. కాగా.. ఇప్పుడు ఇలా జూన్ 9వ పెళ్లి చేసుకోవాలనుకుంటున్న నయన్-విఘ్నేష్ లు ఎక్కువ కాలం కలిసి ఉండే అవకాశం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. నయనతారకు వివాహం కలిసి రాదని.. ఆమెకు గురుడు నీచ స్థితిలో ఉండడంతో.. వైవాహిక జీవితంలో కలతలు.. గొడవలు జరిగే అవకాశం ఉందని.. తద్వార భర్త నుండి విడిపోతుందని చెప్పారు. దీనిపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ కనిపిస్తున్నాయి.