Vijay Devarakonda: లైగర్ హాట్ కామెంట్స్.. ఇష్టం లేకపోయినా చేశాడట!

టాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన విజయ్ దేవరకొండ ‘లైగర్’ ట్రైలర్ ఎట్టకేలకు రిలీజ్ అయ్యింది. అయితే లైగర్ సినిమా కోసం తాము చాలా కష్టపడ్డామని.. తనకు డ్యాన్స్ అంటే చిరాకు అని.. అయినా తన అభిమానుల కోసం ఈ సినిమాలో డ్యాన్స్, ఫైట్స్ చేశానంటూ విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు.

Vijay Devarakonda: లైగర్ హాట్ కామెంట్స్.. ఇష్టం లేకపోయినా చేశాడట!

Vijay Devarakonda About Liger At Trailer Launch

Updated On : July 21, 2022 / 12:54 PM IST

Vijay Devarakonda: టాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన విజయ్ దేవరకొండ ‘లైగర్’ ట్రైలర్ ఎట్టకేలకు రిలీజ్ అయ్యింది. స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ తెరకెక్కించిన ఈ ఔట్ అండ్ ఔట్ కల్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీలో విజయ్ దేవరకొండ ఓ బాక్సింగ్ ఫైటర్‌గా మనల్ని ఎంటర్‌టైన్ చేసేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, టీజర్, సాంగ్ ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ఇక ఇప్పుడు ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను లైగర్ మేనియాలో ఊపేస్తుంది.

Liger Trailer: నువ్వు ఫైటర్ అయితే మరి నేనేంటి – మైక్ టైసన్

హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్‌లో ఈ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ను ప్రేక్షకుల మధ్య ఘనంగా నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ ట్రైలర్ లాంఛ్ వేడుకకు లైగర్ చిత్ర యూనిట్ మొత్తం హాజరయ్యారు. ఈ క్రమంలో హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ అనన్యా పాండేలకు గ్రాండ్ వెల్క్‌మ్ చెప్పారు అభిమానులు. ఇక ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ఈ మాస్ మెంటల్ ఏందిరా అయ్యా.. మా అయ్యా తెల్వదు, మా తాతా తెల్వదు.. నా సినిమా రిలీజ్ అయ్యి రెండేళ్లు అవుతోంది.. అది కూడా పెద్దగా చెప్పుకునే సినిమా కాదు.. ట్రైలర్‌కే ఈ రచ్చ ఏందిరా నాయానా.. మీ ప్రేమను నేను మాటల్లో చెప్పలేనంటూ కామెంట్ చెశాడు. ఇక లైగర్ సినిమాలో తన మేనరిజంతో ‘ఐ..ఐ..ఐ.. లవ్ యు’ అంటూ తన అభిమానులకు కావాల్సినంత కిక్ ఇచ్చాడు.

Vijay Devarakonda : లైగర్ బిజినెస్ అయిపోయిందా?? విజయ్ కి బాలీవుడ్ బాగా కలిసొస్తుందా??

అయితే లైగర్ సినిమా కోసం తాము చాలా కష్టపడ్డామని.. తనకు డ్యాన్స్ అంటే చిరాకు అని.. అయినా తన అభిమానుల కోసం ఈ సినిమాలో డ్యాన్స్, ఫైట్స్ చేశానంటూ విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు. ఈ సినిమాను తన అభిమానులకు డెడికేట్ చేస్తున్నట్లుగా విజయ్ దేవరకొండ పేర్కొన్నాడు. ఇక హీరోయిన్ అనన్యా పాండే మాట్లాడుతూ.. ఈ సినిమాకు, విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ చూసి తాను షాక్ అవుతున్నానని.. తాను కూడా హైదరాబాదీల ప్రేమకు ఫిదా అయిపోయానని చెప్పుకొచ్చింది. ఈ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో దర్శకుడు పూరీ జగన్నాధ్, ఛార్మి, కరణ్ జోహర్‌లు కూడా పాల్గొన్నారు. ఇక ఆగస్టు 25న ఇండియాను షేక్ చేద్దామని విజయ్ దేవరకొండ చెప్పడంతో ఫ్యాన్స్ రీసౌండ్‌తో హాలు మొత్తం లైగర్ పేరుతో మార్మోగిపోయింది.