Vijay Devarakonda: ఇన్‌స్టాగ్రామ్‌లో 18 మిలియన్ ఫాలోవర్స్‌తో విజయ్ దేవరకొండ నయా రికార్డు!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండకు సోషల్ మీడియాలో సాలిడ్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఆయన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఏకంగా 18 మిలియన్ ఫాలోవర్స్ కు చేరుకోవడం విశేషం.

Vijay Devarakonda: ఇన్‌స్టాగ్రామ్‌లో 18 మిలియన్ ఫాలోవర్స్‌తో విజయ్ దేవరకొండ నయా రికార్డు!

Vijay Devarakonda Instagram Followers Reach 18 Million

Updated On : April 5, 2023 / 9:18 PM IST

Vijay Devarakonda: టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండకు ఎలాంటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయన సినిమా వస్తుందంటే అభిమానులు థియేటర్లకు క్యూ కడుతుంటారు. ముఖ్యంగా యూత్, విజయ్ దేవరకొండ సినిమాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అటు సోషల్ మీడియాలోనూ విజయ్ దేవరకొండ ఫాలోయింగ్ చూస్తే అవాక్కవ్వాల్సిందే.

Vijay Devarakonda: ఆ స్టార్ డైరెక్టర్‌తో విజయ్ సినిమా.. క్యూ చూస్తుంటే లేనట్టే అనిపిస్తోందిగా..?

తాజాగా తన సోషల్ ప్లాట్‌ఫాంలో విజయ్ దేవరకొండ సరికొత్త మైలురాయికి చేరుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో విజయ్ దేవరకొండను ఏకంగా 18 మిలియన్ ఫాలోవర్స్ ఫాలో చేస్తున్నారు. స్టార్ హీరోలకున్న క్రేజ్‌ను విజయ్ దేవరకొండ అలవోకగా అందుకోవడంతో ఇప్పుడు ఇది టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఇక విజయ్ ఫాలోవర్స్ కూడా ఆయన సినిమాలతో పాటు సోషల్ మీడియా స్టఫ్‌ను ఎంజాయ్ చేస్తుంటారు.

Vijay Devarakonda: యంగ్ సెన్సేషన్‌తో రొమాన్స్‌కు రౌడీ స్టార్ రెడీ..?

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఖుషి’ అనే సినిమాలో నిటిస్తున్నాడు ఈ క్రేజీ స్టార్. ఈ సినిమాలో అందాల భామ సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.