Vijay Devarakonda : హిట్ ఇవ్వలేకపోయాను.. అసలు ఇక్కడికి రాకూడదనుకున్నా.. వైరల్ గా మారిన విజయ్ దేవరకొండ స్పీచ్

సైమా వేడుకల్లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ''సైమా అవార్డ్స్ అందుకున్న అందరికి కంగ్రాట్స్. మీరంతా కలిసి ఈ సంవత్సరం సినీ పరిశ్రమకి హిట్స్ ఇచ్చి ముందుకు తీసుకెళ్లారు. నేను కూడా పరిశ్రమకి హిట్ ఇద్దామనుకున్నాను. దాని కోసం................

Vijay Devarakonda : హిట్ ఇవ్వలేకపోయాను.. అసలు ఇక్కడికి రాకూడదనుకున్నా.. వైరల్ గా మారిన విజయ్ దేవరకొండ స్పీచ్

Vijay Devarakonda Speech at SIIMA Awards goes Viral

Updated On : October 11, 2022 / 11:18 AM IST

Vijay Devarakonda :  విజయ్ దేవరకొండ ఇటీవల లైగర్ సినిమాతో వచ్చి భారీ పరాజయం చూశాడు. సినిమా మీద ఓవర్ హైప్ ఇచ్చి అంచనాలని అందుకోలేకపోయాడు. లైగర్ సినిమా తర్వాత విజయ్ బయట ఈవెంట్స్ లో ఎక్కడా కనపడట్లేదు. సోషల్ మీడియాలో కూడా ఎక్కువ సందడి చెయ్యట్లేదు. లైగర్ సినిమా తర్వాత మొదటి సారి సైమా(సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌) వేడుకల్లో పాల్గొన్నాడు విజయ్.

ఈ సారి సైమా అవార్డ్స్ లో యూత్‌ ఐకాన్‌ ఆఫ్‌ ది సౌత్‌ ఇండియన్‌ సినిమా అవార్డును గెలుచుకున్నాడు. ఈ అవార్డుని తీసుకోవడానికి విజయ్ సైమా అవార్డ్స్ కి వచ్చాడు. అవార్డు అందుకున్న తర్వాత విజయ్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. సైమా వేడుకల్లో విజయ్ ఇచ్చిన స్పీచ్ ఇప్పుడు వైరల్ గా మారింది.

Bellamkonda Suresh : ఆది రీరిలీజ్ చేస్తా.. చెన్నకేశవరెడ్డి రీరిలీజ్ కి వచ్చిన డబ్బులన్నీ బసవతారకం ట్రస్ట్‌కి ఇస్తాం..

సైమా వేడుకల్లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ”సైమా అవార్డ్స్ అందుకున్న అందరికి కంగ్రాట్స్. మీరంతా కలిసి ఈ సంవత్సరం సినీ పరిశ్రమకి హిట్స్ ఇచ్చి ముందుకు తీసుకెళ్లారు. నేను కూడా పరిశ్రమకి హిట్ ఇద్దామనుకున్నాను. దాని కోసం ప్రయత్నించాను కాని కుదరలేదు. అందరికి మంచి రోజులు, చెడ్డ రోజులు ఉంటాయి. అసలు ఈ ఈవెంట్ కి రాకూడదు అనుకున్నాను. కాని ఈ అవార్డు మీ వల్ల వచ్చింది కాబట్టి మీ కోసం ఈ ఈవెంట్ కి వచ్చాను. మీ అందరికి ఒకటే విషయం చెప్తున్నాను, మీ అందర్నీ కచ్చితంగా ఎంటర్టైన్ చేస్తాను” అని ఎమోషనల్ అయ్యాడు. లైగర్ ఫ్లాప్ తర్వాత విజయ్ మొదటి సారి మాట్లాడటంతో వీడియో వైరల్ గా మారింది.