Family Star : ‘ఫ్యామిలీ స్టార్’ సక్సెస్ కోసం విజయ్ ప్రత్యేక పూజలు..

‘ఫ్యామిలీ స్టార్’ సక్సెస్ కోసం ప్రత్యేక పూజలు చేస్తున్న విజయ్ దేవరకొండ.

Family Star : ‘ఫ్యామిలీ స్టార్’ సక్సెస్ కోసం విజయ్ ప్రత్యేక పూజలు..

Vijay Deverakonda conduct special poojas for Family Star success

Updated On : March 27, 2024 / 3:21 PM IST

Family Star : ‘గీతగోవిందం’ తరువాత విజయ్ దేవరకొండకి సరైన హిట్టు పడలేదు. గత ఏడాది ‘ఖుషి’ వంటి లవ్ రొమాంటిక్ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చి పరవాలేదు అనిపించుకున్నారు అంతే. దీంతో ఈసారి ఎలాగైనా ఒక పెద్ద హిట్టు కొట్టడం కోసం.. విజయ్ మళ్ళీ గీతగోవిందం దర్శకుడు పరుశురాంనే నమ్ముకున్నారు. ‘ఫ్యామిలీ స్టార్’ అనే సినిమా అనౌన్స్ చేసి షూటింగ్ ని కూడా పూర్తీ చేసారు.

ప్రస్తుతం ప్రమోషన్స్ లో ఉన్న ఈ చిత్రం.. వచ్చే వారం రిలీజ్ కాబోతుంది. దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమా హిట్ కావాలని విజయ్ దేవరకొండ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. దర్శకనిర్మాతలతో కలిసి నేడు దిల్ రాజు ఆఫీస్ లో విజయ్.. హోమం మరియు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మరి ఈ పూజలు, గీతగోవిందం కాంబినేషన్ కలిసొచ్చి హిట్ అందిస్తుందా లేదా అనేది చూడాలి.

Also read : Balakrishna – Prithviraj Sukumaran : హీరో పృథ్వీరాజ్ డైరెక్షన్‌లో బాలయ్య మూవీ.. వీడియో వైరల్..

కాగా ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ భామతో పాటు మరో ముగ్గురు హీరోయిన్స్ కూడా ఈ సినిమాలో కనిపించబోతున్నారట. అమెరికన్ యాక్ట్రెస్ ‘మరిస్సా రోజ్ గార్డన్’ ఒక ముఖ్య పాత్ర చేస్తుంటే, మజిలీ ఫేమ్ ‘దివ్యాంశ కౌశిక్’ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇక విజయ్ రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ రష్మిక మందన్న ఒక సాంగ్ లో గెస్ట్ అపిరెన్స్ ఇవ్వబోతున్నారట.

ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. గీతగోవిందం చిత్రానికి సంగీతం అందించింది కూడా గోపి సుందరే. ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం మిడిల్ క్లాస్ నేపథ్యంతో రూపొందుతుంది. ప్రతి మిడిల్ క్లాస్ పోరాటాన్ని ఈ సినిమాల్లో చూపించబోతున్నారు. మరి ఈ చిత్రం ఆడియన్స్ ని ఎంతవరకు అలరించి ఆకట్టుకుంటుందో చూడాలి.