Kingdom Collections : ‘కింగ్డమ్’ ఫస్ట్ డే కలెక్షన్స్.. విజయ్ దేవరకొండ కెరీర్ హైయెస్ట్..?
నిర్మాత మాట్లాడుతూ చాలా చోట్ల 50 శాతం ఓపెనింగ్స్ వచ్చాయి అని తెలిపారు.

Kingdom Collections
Kingdom Collections : విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా నిన్న జులై 31న థియేటర్స్ లో రిలీజయి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ముందు నుంచి ఈ సినిమాపై భారీ హైప్ ఉండటంతో ఓపెనింగ్స్ భారీగానే వచ్చాయని అంటున్నారు. ఈ సినిమా 110 కోట్ల గ్రాస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రంగంలోకి దిగింది. నిన్న నిర్మాత మాట్లాడుతూ చాలా చోట్ల 50 శాతం ఓపెనింగ్స్ వచ్చాయి అని తెలిపారు.
బాక్సాఫీస్ సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కింగ్డమ్ సినిమా మొదటి రోజు దాదాపు 30 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ సాధించిందని సమాచారం. అంటే ఆల్మోస్ట్ 15 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ వచ్చినట్టు తెలుస్తుంది. తెలుగు స్టేట్స్ లోనే మొదటి రోజు ఆల్మోస్ట్ 18 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయని సమాచారం. అమెరికాలో అయితే ఆల్రెడీ 1.1 మిలియన్ డాలర్స్ గ్రాస్ వచ్చేసినట్టు అధికారికంగానే ప్రకటించారు. అంటే ఆల్మోస్ట్ 8 కోట్ల రూపాయలకు పైగా అమెరికా నుంచి కలెక్షన్స్ మొదటి రోజే వచ్చాయి.
అధికారికంగా మూవీ యూనిట్ నుంచి కలెక్షన్స్ పై ప్రకటన రావాల్సి ఉంది. విజయ్ గత సినిమాల్లో లైగర్ కి ఉన్న హైప్ తో ఓపెనింగ్ రోజు 23 కోట్ల గ్రాస్ వచ్చింది. ఆ తర్వాత ఖుషి సినిమాకు 16 కోట్ల వరకు వచ్చాయి. ఇప్పుడు విజయ్ తన రికార్డులను బద్దలు కొట్టి కింగ్డమ్ సినిమాతో 30 కోట్ల ఓపెనింగ్స్ సాధించినట్టు తెలుస్తుంది. ఇక ఈ వీకెండ్ మూడు రోజుల్లో ఈజీగా 100 కోట్ల గ్రాస్ దాటేస్తాడని భావిస్తున్నారు.