Vijay Deverakonda – Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఫ్లాప్ సినిమాలో ఆ రెండు సాంగ్స్.. విజయ్ దేవరకొండకి చాలా ఇష్టం అంట..

విజయ్ దేవరకొండ తాజాగా ఓ తమిళ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు.

Vijay Deverakonda – Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఫ్లాప్ సినిమాలో ఆ రెండు సాంగ్స్.. విజయ్ దేవరకొండకి చాలా ఇష్టం అంట..

Vijay Deverakonda Loves Two Songs from Pawan Kalyan Flop Movie

Updated On : May 15, 2025 / 5:37 PM IST

Vijay Deverakonda – Pawan Kalyan : విజయ్ దేవరకొండ త్వరలో కింగ్డమ్ సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా జులై 4న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాని పాన్ ఇండియా రిలీజ్ చేస్తుండటంతో ఇప్పట్నుంచే ప్రమోషన్స్ చేస్తున్నారు.

విజయ్ దేవరకొండ తాజాగా ఓ తమిళ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. కింగ్డమ్ సినిమాకు తమిళ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ మ్యూజిక్ ఇచ్చాడు. ఇంటర్వ్యూలో అనిరుధ్ కంపోజింగ్ లో మీకు బాగా ఇష్టమైన 5 సాంగ్స్ చెప్పండి అని అడిగారు.

Also Read : Jayam Ravi : నా పిల్లలను దూరం చేయకు.. గతంలో వెన్నుపోటు.. ఇప్పుడు డైరెక్ట్ గానే పొడిచింది.. భార్యకు కౌంటర్ ఇచ్చిన హీరో..

దీంతో విజయ్ దేవరకొండ.. నాకు పర్సనల్ గా బాగా ఇష్టమైన సాంగ్ ‘గాలివాలుగా..’ సాంగ్ అజ్ఞాతవాసి సినిమా నుంచి అది నాకు చాలా ఇష్టం. అలాగే అదే సినిమాలో ‘బయటకొచ్చి చూస్తే టైం..’ సాంగ్ కూడా ఇష్టం. ఆ సాంగ్ రీసెంట్ టైంలో రిపీట్ మోడ్ లో వింటున్నాను అని చెప్పాడు. దీంతో విజయ్ కి బాగా నచ్చిన సాంగ్స్ లో రెండు పవన్ కళ్యాణ్ ఫ్లాప్ సినిమా అజ్ఞాతవాసివి కావడంతో పవన్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తూ విజయ్ మాట్లాడిన వీడియోని వైరల్ చేస్తున్నారు.


 

Also Read : NTR – Aamir Khan : ఎన్టీఆర్ వర్సెస్ అమీర్ ఖాన్.. ఎవరు దాదా సాహెబ్ ఫాల్కే..? ఫ్యాన్స్ లో కన్ఫ్యూజన్..