Family Star Glimpse : ‘ఫ్యామిలీ స్టార్’గా విజయ్ దేవరకొండ మాస్.. గ్లింప్స్ అదుర్స్..

VD13 వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న విజయ్ దేవరకొండ, పరుశురామ్ మూవీ టైటిల్ ని అనౌన్స్ చేశారు.

Family Star Glimpse : ‘ఫ్యామిలీ స్టార్’గా విజయ్ దేవరకొండ మాస్.. గ్లింప్స్ అదుర్స్..

Vijay Deverakonda Mrunal Thakur VD13 titled as Family Star

Updated On : October 18, 2023 / 7:45 PM IST

Family Star Glimpse : గీతగోవిందం కాంబినేషన్ విజయ్ దేవరకొండ, పరుశురామ్ కలయికలో తెరకెక్కుతున్న రెండో మూవీ VD13. మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా ఇటీవల షూటింగ్ మొదలు పెట్టుకొని శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. VD13 వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీకి ‘ఫ్యామిలీ స్టార్’, ‘కుటుంబరావు’ అనే టైటిల్స్ పరిశీలిస్తున్నట్లు కొన్ని రోజులు నుంచి ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తూ వచ్చింది. తాజాగా నేడు ఈ మూవీ టైటిల్ ని మేకర్స్ అనౌన్స్ చేశారు.

ఇక ఫస్ట్ నుంచి గట్టిగా వినిపిస్తున్న ‘ఫ్యామిలీ స్టార్’ టైటిల్ నే ఖరారు చేశారు మేకర్స్. టైటిల్ కి తగ్గట్టే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పూర్తి ఫ్యామిలీ మ్యాన్ గా కనిపించబోతున్నాడు. తండ్రిగా, భర్తగా ఒక కొత్త రోల్ లో విజయ్ ఆడియన్స్ ని థ్రిల్ చేయబోతున్నాడు. అయితే ఇది పూర్తి ఫ్యామిలీ ఎమోషన్ కథ అనుకోకండి. ఎందుకంటే, టైటిల్ గ్లింప్స్ లో మాస్ ని కూడా చాలా క్లాస్ గా చూపించేశాడు దర్శకుడు పరుశురామ్. ఇక గ్లింప్స్ చివరిలో విజయ్ ని మృణాల్.. ‘ఏవండీ’ అని పిలవడం ఆడియన్స్ కి మరో థ్రిల్ అనే చెప్పాలి.

Also read : Kalki 2898 AD : ప్రభాస్ కల్కి బయటకి వెళ్లాలంటే.. నేను ముందు ఉండాలి.. రానా వైరల్ కామెంట్స్..