Kushi Trailer : విజయ్ దేవరకొండ, సమంత ఖుషి మొదలైంది.. ట్రైలర్ రిలీజ్..!

విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటించి ఖుషి మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యింది.

Kushi Trailer : విజయ్ దేవరకొండ, సమంత ఖుషి మొదలైంది.. ట్రైలర్ రిలీజ్..!

Vijay Deverakonda Samantha Kushi movie Trailer released

Updated On : August 9, 2023 / 3:46 PM IST

Kushi Trailer : విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) కలయికలో రాబోతున్న లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ ‘ఖుషి’. శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం ఎట్టకేలకు ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్దమవుతుంది. గత కొంతకాలంగా ప్రమోషన్స్ లో భాగంగా ఈ మూవీ నుంచి ఒక్కొక సాంగ్ రిలీజ్ చేస్తూ వచ్చారు. ఈక్రమంలో ఆడియన్స్ ముందుకు వచ్చిన ‘నా రోజా నువ్వే’, ‘ఆరాధ్య’, ‘ఖుషి’ టైటిల్ సాంగ్స్ చార్ట్ బస్టర్స్ గా నిలిచి యూట్యూబ్ లో రికార్డులు సృష్టించాయి. తాజాగా ఇప్పుడు మూవీ ట్రైలర్ ని కూడా ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు.

Mahesh Babu : ఫారిన్‌లో ఫ్యామిలీతో మహేష్ బాబు బర్త్ డే వెకేషన్.. పిక్స్ చూశారా..?

Mahesh Babu : మహేష్‌కి టాలీవుడ్ సెలబ్రిటీస్ బర్త్ డే విషెస్.. ఎవరెవరు విష్ చేశారో తెలుసా..?

ట్రైలర్ చూస్తుంటే ఇప్పటి జనరేషన్ వాళ్ళు పెళ్లి చేసుకున్న తరువాత వారి మధ్య వచ్చే చిన్న చిన్న సమస్యలను ఈ సినిమాలోని కథగా చూపించబోతున్నారని తెలుస్తుంది. అలాగే ట్రైలర్
లో విజయ్ ని చూస్తుంటే గీతగోవిందం ఫీలింగ్ ని ఇస్తుంది. ఆ మూవీలోని కామెడీ, ఎమోషన్స్. లవ్ ఈ సినిమాలో కూడా కనిపించబోతున్నాయని తెలుస్తుంది.

Shah Rukh – Ranveer : షారుఖ్‌ని పక్కన పెట్టి రణ్వీర్ సింగ్‌తో డాన్ సిరీస్.. డాన్ 3 గ్లింప్స్ రిలీజ్..

మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా నిర్మించారు. ఈక్రమంలోనే ప్రతి సాంగ్ ని తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ట్రైలర్ ని అదే తరహాలో విడుదల చేశారు. ఈ చిత్రానికి మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేశం అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నాడు. సెప్టెంబర్ 1న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ఈ మూవీ హిట్ అవ్వడం విజయ్ అండ్ సమంతకి చాలా అవసరం. వీరిద్దరి గత చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ పరాజయాన్ని అందుకున్నాయి. దీంతో ఇద్దరు అభిమానులు ఒక్క హిట్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ చిత్రం వారి కోరికను నెరవేరుస్తుందో లేదో చూడాలి.