Jana Nayagan: రీమేక్ కాదన్నారు.. మన సినిమానే దించేశారు.. ఏంటి సార్ ఇది!

తమిళ స్టార్ విజయ్ తళపతి హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ జన నాయగన్(Jana Nayagan) మూవీ ట్రైలర్ విడుదల అయ్యింది.

Jana Nayagan: రీమేక్ కాదన్నారు.. మన సినిమానే దించేశారు.. ఏంటి సార్ ఇది!

Vijay Jana nayagan movie is a remake of Bhagavanth Kesari.

Updated On : January 4, 2026 / 7:21 AM IST
  • జన నాయకుడు ట్రైలర్ రిలీజ్
  • రీమేక్ కాదన్నారు మక్కీకి మక్కీ దించేశారు
  • తెలుగు ఆడియన్స్ డిజప్పాయింట్ అవుతున్నారు

Jana Nayagan: తమిళ స్టార్ విజయ్ తళపతి హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ జన నాయగన్. ఇదే సినిమాను తెలుగులో జన నాయకుడు పేరుతో విడుదల చేస్తున్నారు. దర్శకుడు హెచ్ వినోత్ తెరకెక్కిస్తున్న ఈ సోషల్ మాస్ ఎంటర్టైనర్ లో మమిత బైజు, పూజ హెగ్డే కీ రోల్స్ చేస్తున్నారు. ఇది విజయ్ కి చివరి సినిమా కావడం విశేషం. అందుకే, ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో నెలకొన్నాయి.

సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. అయితే, జన నాయగన్(Jana Nayagan) సినిమా గురించి ముందు నుంచి ఒక చర్చ నడుస్తోంది. అదేంటంటే, ఈ సినిమా తెలుగులో బ్లాక్ బస్టర్ అయిన భగవంత్ కేసరి సినిమాకు రీమేక్. అని, ఇప్పటివరకు రిలీజ్ చేసిన వాటిలో కూడా ఆ ఛాయలు కనిపించాయి. కానీ, రీసెంట్ గా జరిగిన జన నాయగన్ ఆడియో ఈవెంట్ లో దర్శకుడు హెచ్ వినోత్ మాట్లాడుతూ ఇది ఏ సినిమాకు రీమేక్ కాదని చెప్పాడు.

Hyper Aadi: పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే చంపేస్తాం.. షాకింగ్ విషయాలు చెప్పిన హైపర్ ఆది

అలాగే, ఇది కొత్త కథ అని ఆడియన్స్ ని ఒక రేంజ్లో మెప్పిస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు. దర్శకుడు చేసిన ఈ కామెంట్స్ తో చాలా మంది ఇది రీమేక్ కాదని ఫిక్స్ అయ్యారు. కానీ, తాజాగా విడుదల చేసిన జన నాయగన్ ట్రైలర్ చూశాక కన్ఫర్మ్ అయ్యింది. ఇది పక్కా భగవంత్ కేసరి సినిమా రీమేక్ అని. చాలా సీన్స్, లొకేషన్స్, డైలాగ్స్ మిక్కీకి మక్కీ దించేశారు.

కాకపోతే, ప్రస్తుతం విజయ్ పొలిటికల్ కెరీర్ కి తగ్గట్టుగా కొన్ని సీన్స్ యద చేశారు. అలాగే ట్రైలర్ కి డైలాగ్స్ కూడా తన పొలిటికల్ కెరీర్ కి సెట్ అయ్యేలా చూసుకున్నారు. అయితే, ఈ ట్రైలర్ చూసిన తెలుగు ఆడియన్స్ మాత్రం పెదవి విరుస్తున్నారు. ఈ మాత్రం దానికి రీమేక్ కాదు, కొత్త కథ అని చెప్పడం ఎందుకు. ఒప్పేసుకుంటే సరిపోతుంది కదా. అయినా విజయ్ కి రీమేక్స్ చేయడం కొత్తేమి కాదు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి తన చివరి సినిమాగా రీమేక్ చేస్తున్న విజయ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడు అనేది చూడాలి.