Vijay Sethupathi : వాట్.. 100 కోట్ల సినిమాకి ఈ హీరో ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదా?

మహారాజా సినిమాకు విజయ్ సేతుపతి ముందు రెమ్యునరేషన్ తీసుకోలేదట.

Vijay Sethupathi : వాట్.. 100 కోట్ల సినిమాకి ఈ హీరో ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదా?

Vijay Sethupathi did not take remuneration for Maharaja movie Interesting News

Updated On : August 1, 2024 / 10:08 AM IST

Vijay Sethupathi : తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఇటీవల తన 50వ సినిమాగా మహారాజా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించాడు. చాలా రెగ్యులర్ కథే అయినా సరికొత్త స్క్రీన్ ప్లేతో అలరించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. మహారాజ సినిమా ఆల్మోస్ట్ 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. తెలుగులో కూడా ఈ సినిమా పెద్ద హిట్ అయింది. అయితే ఈ సినిమాకు విజయ్ సేతుపతి ముందు రెమ్యునరేషన్ తీసుకోలేదట.

ఈ సినిమా నిర్మాత ఇబ్బందుల్లో ఉండటంతో పాటు కథ కూడా బాగా నచ్చడంతో సినిమా రిలీజయ్యాక హిట్ అయితే అప్పుడు డబ్బులు ఇవ్వమని చెప్పాడట విజయ్ సేతుపతి. ఈ సినిమాని కేవలం 20 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కించారు. అనుకున్న దానికన్నా పెద్ద హిట్ అయింది మహారాజ సినిమా. థియేటర్స్ లోనే కాక, ఓటీటీ, శాటిలైట్ హక్కులు కూడా మంచి రేటుకు అమ్ముడుపోయాయి. సినిమా హిట్ అయి డబ్బులు వచ్చాకే విజయ్ సేతుపతి రెమ్యునరేషన్ తీసుకున్నాడని తమిళ మీడియాలో వార్తలు వచ్చాయి.

Also Read : Nani – Keerthy Suresh : నాని కొడుకు కీర్తి సురేష్ ని ఏమని పిలుస్తాడో తెలుసా? నాని కొడుకుపై కీర్తి ఆసక్తికర వ్యాఖ్యలు..

గతంలో కథ నచ్చితే ఫ్రీగా చేయడానికి కూడా రెడీ, కావాలంటే సినిమా హిట్ అయ్యాక నిర్మాతలు డబ్బులు ఇవ్వొచ్చు అని విజయ్ సేతుపతి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇప్పుడు అది నిజం చేసి చూపించారు. ఓ మంచి సినిమాతో వచ్చి రూపాయి రెమ్యునరేషన్ కూడా తీసుకోకుండా సినిమా చేసి హిట్ కొట్టారు విజయ్ సేతుపతి. దీంతో మరోసారి విజయ్ సేతుపతిని పలువురు అభినందిస్తున్నారు. ఇలా సినిమా రిలీజ్ అయి హిట్ అయ్యాకే డబ్బులు తీసుకుంటే చాలా సినిమాలు తక్కువ బడ్జెట్ లోనే చేయొచ్చు, నిర్మాతలు కూడా బాగుంటారు అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.