హలో బాలీవుడ్ – ఆమీర్ ఖాన్ సినిమాలో విజయ్ సేతుపతి

మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమీర్ ఖాన్ నటిస్తున్న ‘లాల్ సింగ్ చద్దా’లో విజయ్ సేతుపతి ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టు ఇటీవల తెలిపాడు..

  • Published By: sekhar ,Published On : November 27, 2019 / 05:38 AM IST
హలో బాలీవుడ్ – ఆమీర్ ఖాన్ సినిమాలో విజయ్ సేతుపతి

Updated On : November 27, 2019 / 5:38 AM IST

మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమీర్ ఖాన్ నటిస్తున్న ‘లాల్ సింగ్ చద్దా’లో విజయ్ సేతుపతి ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టు ఇటీవల తెలిపాడు..

మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమీర్ ఖాన్ నటిస్తున్న ‘లాల్ సింగ్ చద్దా’ షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది.. ఆస్కార్ అవార్డ్ అందుకున్న హాలీవుడ్ మూవీ ‘ఫారెస్ట్ గంప్’ రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘సీక్రెట్ సూపర్ స్టార్’ ఫేమ్ అద్వైత్ చందన్ డైరెక్టర్. కరీనా కపూర్ కథానాయిక.. ఇటీవల విడుదల చేసిన‘లాల్ సింగ్ చద్దా’ ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది.

Vijay Sethupathi to make his Bollywood debut with Aamir Khan’s Laal Singh Chaddha

ఈ సినిమాకు మరో ప్రత్యేక ఆకర్షణ తోడయింది. వైవిధ్యమైన పాత్రలతో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి ఈ సినిమా ద్వారా హిందీ చిత్రసీమకు పరిచయమవుతున్నాడు. ‘లాల్ సింగ్ చద్దా’లో విజయ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టు ఇటీవల తెలిపాడు.

vijay sethupathi

తెలుగులో ‘సైరా’ చిత్రంలో ఆకట్టుకున్న విజయ్ సేతుపతి తన మొదటి బాలీవుడ్ సినిమా  ఆమీర్ ఖాన్ లాంటి బిగ్ స్టార్‌తో చేయడం విశేషం. 2020 క్రిస్మస్‌కు ‘లాల్ సింగ్ చద్దా’ రిలీజ్ కానుంది. నిర్మాణం : ఆమీర్ ఖాన్, కిరణ్ రావ్, వయాకామ్ 18 స్టూడియోస్..