రాముడికి రంగం సిద్ధమైంది

సినిమా చూసిన సెన్సార్ బృందం, వినయ విధేయ రామకి యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది.

  • Published By: sekhar ,Published On : January 5, 2019 / 09:49 AM IST
రాముడికి రంగం సిద్ధమైంది

సినిమా చూసిన సెన్సార్ బృందం, వినయ విధేయ రామకి యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో, ఫ్యామిలీ, లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన వినయ విధేయ రామ, జనవరి 11న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్‌కి రెఢీ అయిపోయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు, ప్రమోషన్స్ కూడా శరవేగంగా  జరుగుతున్నాయి. ట్రైలర్ అండ్ సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వస్తుంది. రీసెంట్‌గా వినయ విధేయ రామ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.

సినిమా చూసిన సెన్సార్ బృందం, వినయ విధేయ రామకి యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. చరణ్ పక్కన ఫస్ట్ టైమ్ కైరా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తుంది. దేవిశ్రీ మ్యూజిక్ కంపోజ్ చేసాడు. వినయ విధేయ రామ, సంక్రాంతి కానుకగా జనవరి 11న గ్రాండ్‌గా రిలీజవనుంది.

వాచ్ ట్రైలర్…