Viral Pics: నాన్‌స్టాప్‌గా ముద్దులు పెడుతూ.. రష్మికా మందన్నా ఫోటోలు వైరల్!

Viral Pics: నాన్‌స్టాప్‌గా ముద్దులు పెడుతూ.. రష్మికా మందన్నా ఫోటోలు వైరల్!

Viral Pics Rashmika Mandannas Day Was About Shifting Homes And Pet Aura

Updated On : June 24, 2021 / 10:30 AM IST

Rashmika Mandanna: పెంపుడు జంతువులలో ప్రధానంగా కుక్కల గురించి చెప్పుకోవాలి. మనుషులకు, శునకాలకు మధ్య అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్రర్లేదు.. ముఖ్యంగా సెలబ్రిటీలు, అందులో సినిమా హీరోయిన్లు ఎక్కువగా కుక్కలను లైక్ చేస్తూ ఉంటారు. కుక్కలను ఇంట్లో మనుషుల్లా భావిస్తూ ఉంటారు. అమల, ఛార్మీ లాంటివారు ఇప్పటికే వారికి కుక్కలతో అనుబంధాన్ని వ్యక్తం చేశారు.


ఈ క్రమంలోనే దక్షిణాది స్టార్ హీరోయిన్ రష్మికా మందన్నా కూడా తనకు తన కుక్కతో ఉన్న అనుబంధాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది. లేటెస్ట్‌గా రష్మికా మందన్నకు తన కుక్కపిల్ల ముద్దు పెడుతూ ఉండగా.. క్లిక్‌మనిపించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ముంబైకి మకాం మార్చేసిన రష్మికా మందన్నా.. తన బొచ్చుకుక్క పిల్లతో కలిసి షాపింగ్‌కు వెళ్ళింది. అక్కడ ఫోటోగ్రాఫర్లు ఆమెను క్లిక్‌మనిపించారు. ఇప్పుడు ఆ ఫోటోలే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సమయంలో రష్మికా మందన్నా తన కుక్కపిల్లకు నాన్‌స్టాప్‌గా ముద్దులు పెడుతూనే ఉన్నారు.


లాక్‌డౌన్ సడలింపులు ఇవ్వగా.. రష్మిక తన బొచ్చుకుక్కపిల్ల ఆరాతో కలిసి షాపింగ్‌కు వెళ్ళింది. అక్కడే ఆమెను చుట్టుముట్టారు ఫోటోగ్రాఫర్లు.. ఆ సమయంలో మృదువుగా కృతజ్ఞతలు తెలుపుతూ, కరోనా సమయంలో అందరూ సురక్షితంగా ఉండాలని కోరారు. అందరూ మాస్క్‌లు ధరించాలని కోరారు. ఈ సమయంలో ఇద్దరు పోలీసులతో ఆమె ఫోటో దిగారు.


రష్మిక మందన్న ప్రస్తుతం తన రెండవ హిందీ సినిమా ‘గుడ్బై’ కోసం ముంబైలో లెజెండ్ అమితాబ్ బచ్చన్‌తో కలిసి షూటింగ్‌లో పాల్గొంటున్నారు. తెలుగులో సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియన్ సినిమా ‘పుష్ప’లో రష్మిక ప్రధాన పాత్రలో నటిస్తోంది.