Karthik Varma : సుకుమార్ గారు చెప్పిన ఆయుర్వేదం వల్లే బతికాను.. ఆయన కూడా ఆయుర్వేదం వాడి.. విరూపాక్ష డైరెక్టర్ వ్యాఖ్యలు..

తాజాగా కార్తీక్ ఓ ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా గురించి, తన గురించి, తేజ్ గురించి, సుకుమార్ గురించి అనేక విషయాలను పంచుకున్నారు. ఈ నేపథ్యంలో తనకున్న హెల్త్ ప్రాబ్లమ్, సుకుమార్ గురించి కూడా మాట్లాడారు.

Karthik Varma : సుకుమార్ గారు చెప్పిన ఆయుర్వేదం వల్లే బతికాను.. ఆయన కూడా ఆయుర్వేదం వాడి.. విరూపాక్ష డైరెక్టర్ వ్యాఖ్యలు..

Virupaksha Director karthik varma says he survived because of the Sukumar

Updated On : June 12, 2023 / 7:19 AM IST

Sukumar :  ఇటీవల విరూపాక్ష(Virupaksha) సినిమాతో సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు డైరెక్టర్ కార్తీక్ వర్మ(Director Karthik Varma). సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) కి మంచి కంబ్యాక్ సినిమా ఇవ్వడమే కాక ప్రేక్షకులకు అదిరిపోయే సినిమాను ఇచ్చి నిర్మాతలకు కూడా 100 కోట్ల సినిమాను ఇచ్చారు కార్తీక్. విరూపాక్ష షూట్ ముందు తేజ్ కి యాక్సిడెంట్ అవ్వడం, కార్తీక్ కూడా ఓ అనారోగ్య సమస్యతో బాధపడటం, సినిమా తెరకెక్కడానికి చాలా కష్టాలు పడినట్టు సినిమా ప్రమోషన్స్ లో డైరెక్టర్ తెలిపారు.

తాజాగా కార్తీక్ ఓ ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా గురించి, తన గురించి, తేజ్ గురించి, సుకుమార్ గురించి అనేక విషయాలను పంచుకున్నారు. ఈ నేపథ్యంలో తనకున్న హెల్త్ ప్రాబ్లమ్, సుకుమార్ గురించి కూడా మాట్లాడారు. కార్తీక్ సినిమా కథను సుకుమార్ కి చెప్పగా సుకుమార్ పలు మార్పులు చేసి సినిమా నిర్మాణంలో భాగమయిన సంగతి తెలిసిందే.

కార్తీక్ వర్మ మాట్లాడుతూ.. నేను సుకుమార్ గారికి కథ నేరేషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆయన వెన్ను నొప్పితో బాధపడుతున్నారు. ఎక్కువ సేపు కూర్చోలేకపోయేవారు. నేను కథ చెప్పడానికి వెళ్తే అయన కింద పడుకొని నన్ను చెప్పామన్నారు. ఆయన ఇబ్బంది చూసి కథ మొత్తం నేరేషన్ ఇవ్వాలా, ఓవర్ లైన్ చెప్పనా అని అడిగితే చెప్పేది నువ్వు నాకేం ప్రాబ్లమ్ లేదు మొత్తం చెప్పు అన్నారు. అంత బాధలో కూడా 2 గంటలు ఆయన నా నేరేషన్ విన్నారు.

అప్పటికి నేను ITP అనే ప్లేట్ లెట్స్ సమస్యతో బాధపడుతున్నాను. దానికి ఇంకా పూర్తిగా మందులు రాలేదు. స్టెరాయిడ్స్ వాడుతూ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాను. బ్లడ్ ఎక్కించుకుంటాను 15 డేస్ కి ఒకసారి. స్టెరాయిడ్స్ వాడటం వల్ల లైఫ్ టైం కూడా తగ్గిపోద్ది అని చెప్పారు. నేను లావు అవ్వడం, సన్నగా అవ్వడం, నా బాడీలో చేంజెస్ చూసి ఓ రోజు సుకుమార్ గారు అడిగారు ఏంటి ప్రాబ్లమ్ అని. నేను మొత్తం చెప్పాక ఆయన ఒక ఆయుర్వేద స్వామిజి వద్దకు వెళ్లి కలవమని, ఆయన కూడా వాడితే వెన్ను నొప్పి సెట్ అయిందని చెప్పారు. నేను అలాంటివి నమ్మను కానీ వెళ్లకపోతే సినిమా ఆగిపోద్దేమో అని వెళ్ళాను. ఆయన ఇచ్చిన కొన్ని ఆకుల రసం 45 రోజులు ఆయన చెప్పినట్టు స్ట్రిక్ట్ గా తాగాను. ఆ తర్వాత ప్లేట్ లెట్స్ కౌంట్ చెక్ కి వెళ్తే సరిపడా ఉన్నాయి. నేను ఆశ్చర్యపోయాను. ఆ తర్వాత కూడా ఎప్పుడూ మళ్ళీ ప్లేట్ లెట్స్ కౌంట్ తగ్గలేదు. సుకుమార్ గారి వల్లే, ఆ ఆయుర్వేదం వల్లే ఇవాళ నేను బతికాను అని తెలిపారు.

Adipurush : ఆదిపురుష్ మరింతమందికి చేరువవ్వడానికి.. ప్రతి రామాలయానికి 101 ఆదిపురుష్ టికెట్లు ఫ్రీ..

అలాగే.. ఆ తర్వాత ఈ విషయం తెలుసుకొని కొంతమంది ఇదే ప్లేట్ లెట్స్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్లు నాకు ఫోన్ చేస్తే దాదాపు 60 మందిని ఆ ఆయుర్వేదం వద్దకు పంపించాను అని కార్తిక్ తెలిపారు.