Virupaksha: మూడు రోజుల్లో అదరగొట్టిన విరూపాక్ష.. హాఫ్ సెంచరీకి చేరువలో తేజు మూవీ!

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ‘విరూపాక్ష’ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల మోత మోగిస్తోంది. ఈ సినిమా తొలి మూడు రోజుల్లో రూ.44 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది.

Virupaksha: మూడు రోజుల్లో అదరగొట్టిన విరూపాక్ష.. హాఫ్ సెంచరీకి చేరువలో తేజు మూవీ!

Virupaksha Solid Collections In Three Days

Updated On : April 24, 2023 / 8:36 PM IST

Virupaksha: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘విరూపాక్ష’ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. రిలీజ్ రోజునే ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఇక ఈ సినిమాను దర్శకుడు కార్తీక్ దండు పూర్తి మిస్టిక్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది.

Virupaksha Collections : కలెక్షన్స్‌లో మొదటిరోజుని మించిన సెకండ్ డే.. యూఎస్‌లో కూడా దూకుడు!

ఇక ఈ సినిమాకు తొలిరోజు నుండే మంచి వసూళ్లు వస్తున్నాయి. ఈ సినిమాలోని హార్రర్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను థ్రిల్ చేయడంలో సక్సెస్ కావడంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ ఆసక్తిని చూపుతున్నారు. కాగా ఈ సినిమాకు తొలిరోజే బాక్సాఫీస్ వద్ద రూ.12 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక వీకెండ్‌లో ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ పెద్దఎత్తున థియేటర్లకు వెళ్లడంతో ఈ సినిమాకు వసూళ్లు పెరిగాయి. ఫస్ట్ వీకెండ్ ముగిసే సరికి ఈ సినిమాకు ఏకంగా రూ.44 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లుగా చిత్ర వర్గాలు తెలిపాయి.

Virupaksha : సినిమా హిట్టు అనుకునేలోపే దర్శకనిర్మాతలకు బిగ్ షాక్.. ఏమైంది?

కేవలం మూడు రోజుల్లోనే ఈ స్థాయిలో కలెక్షన్స్ రావడంతో, ఈ సినిమా త్వరలోనే రూ.50 కోట్ల మార్క్‌ను టచ్ చేయడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి. తేజు కెరీర్‌లోనే ఇవి బెస్ట్ ఫిగర్స్‌గా సినీ ఎక్స్‌పర్ట్స్ పేర్కొంటున్నారు. కాగా ఈ సినిమాలో అందాల భామ సంయుక్తా మీనన్ హీరోయిన్‌గా నటించగా, బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు.