Manchu Vishnu: మేమే గెలుస్తున్నాం.. డిన్నర్ మీట్‌కి 500మంది వచ్చారు -మంచు విష్ణు

మెగా బ్రదర్ నాగబాబు తనపై చేసిన కామెంట్లకు తప్పుకుండా సమాధానం చెబుతానని అన్నారు మంచు విష్ణు.

Manchu Vishnu: మేమే గెలుస్తున్నాం.. డిన్నర్ మీట్‌కి 500మంది వచ్చారు -మంచు విష్ణు

Vishnu

Updated On : October 9, 2021 / 8:18 PM IST

Manchu Vishnu: మెగా బ్రదర్ నాగబాబు తనపై చేసిన కామెంట్లకు తప్పుకుండా సమాధానం చెబుతానని అన్నారు మంచు విష్ణు.

ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన మంచు విష్ణు అనంతరం మాట్లాడుతూ.. శుక్రవారం(8 అక్టోబర్ 2021) నిర్వహించిన మేనిఫెస్టో డిన్నర్‌ పార్టీకి 250 నుంచి 300మంది వస్తారని అనుకుంటే, 560మంది వచ్చారని, అందరూ ‘మా’ సభ్యులేనన్నారు.

మా సభ్యులు అందరూ తనతోనే ఉన్నారని, వారంతా ‘మా’ కుటుంబ సభ్యులేనని అన్నారు. నా కుటుంబ సభ్యులను పిలిచి నాకెందుకు ఓటెయ్యాలో చెప్పానని అన్నారు.

వాళ్లకు నచ్చితే వేస్తారని, చాలా మంది తనపై పాజిటివ్‌గా ఉన్నట్లు చెప్పారు. ‘మా’ చరిత్రలో ఇప్పటివరకు ఎప్పుడూ జరగని రీతిలో ఇతర ప్రాంతాల్లో ఉన్న ‘మా’ సభ్యులు విమానంలో వచ్చి మరీ ఓటు వేసి వెళ్తారని అన్నారు.