Kannappa Trailer : మంచు విష్ణు – ప్రభాస్ ‘కన్నప్ప’ ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ వర్సెస్ విష్ణు.. అదిరిందిగా..
తాజాగా కన్నప్ప సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేసారు. మీరు కూడా కన్నప్ప ట్రైలర్ చూసేయండి..

Vishnu Manchu Prabhas Mohan Babu Mohanlal Akshay Kumar Kajal Aggarwal Kannappa Trailer Released
Kannappa Trailer : మంచు విష్ణు భారీ బడ్జెట్ తో కన్నప్ప సినిమాని తన సొంత బ్యానర్ లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్, శరత్ కుమార్, మధుబాల, బ్రహ్మానందం, మోహన్ బాబు.. ఇలా చాలా మంది స్టార్స్ ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు టీజర్లు, సాంగ్స్ రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తి నెలకొల్పారు. ఈ సినిమా జూన్ 27న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది.
తాజాగా కన్నప్ప సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేసారు. మీరు కూడా కన్నప్ప ట్రైలర్ చూసేయండి..
ఇక ట్రైలర్ చూస్తుంటే.. చిన్నప్పుడు ఓ సంఘటనతో తిన్నడు దేవుడు లేడు అని ఫిక్స్ అవుతాడు. ఆ గూడెంలో పవర్ ఫుల్ వ్యక్తిగా ఎదుగుతాడు తిన్నడు. దేవుడ్ని నమ్మనందుకు తిన్నడిని గూడెం నుంచి దూరం చేయడంతో శివుడు రుద్రుడిని పంపడంతో తిన్నడు ఎలా శివభక్తుడిగా మారాడు, వాయులింగం కోసం ఎవరెవరు పోటీపడుతున్నారు, ఆ వాయులింగాన్ని తిన్నాడు కన్నప్పగా మారి ఎలా కాపాడుకున్నాడు అనే కథాంశం సినిమాలో ఉండబోతుందని తెలుస్తుంది.