చేతిపై టాటూ.. అఖిల్‌ను పెళ్లి చేసుకుంటుందట!

  • Published By: sekhar ,Published On : July 24, 2020 / 02:45 PM IST
చేతిపై టాటూ.. అఖిల్‌ను పెళ్లి చేసుకుంటుందట!

Updated On : July 25, 2020 / 7:19 PM IST

అఖిల్ అక్కినేని అంటే పిచ్చి ఇష్టం.. ఎంత అంటే అతని పేరుని తన చేతిమీద టాటూ వేయించుకునేంత.. దేవుడు ప్రత్యక్షమై ఏదైనా కోరిక కోరుకోమని అడిగితే అతగాణ్ణి పెళ్లి చేసుకునే వరమ్మిమని అడుగుతుందట ఆ యాంకర్.. ఇంతకీ ఎవరా యాంకర్.. ఎవరు ఆమె కలల రాకుమారుడు?.. బుల్లితెరపై హాట్ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న విష్ణుప్రియ భీమినేనికి టాలీవుడ్ యంగ్ అండ్ హ్యాండ్సమ్ హీరో అఖిల్ అక్కినేని అంటే చాలా ఇష్టం అంట. Vishnupriya- Srimukhi అఖిల్ కు సంబంధించిన విష్ణుప్రియ సీక్రెట్స్ అన్నిటినీ తన స్నేహితురాలు బయటపెట్టింది. ఈ హాట్ యాంక‌ర్‌కు మరో హాట్ యాంక‌ర్ శ్రీ‌ముఖి మంచి ఫ్రెండ్. ఈమధ్య ఎక్కడ చూసినా ఈ యాంక‌ర్ జంటే క‌నిపిస్తోంద‌ని టెలివిజన్ ఇండస్ట్రీ టాక్‌. రీసెంట్ గా వీళ్లిద్దరూ కలిసి సీనియర్ యాంకర్ ఝాన్సీ హోస్ట్ చేస్తున్న ఓ షోలో పార్టిసిపేట్ చేశారు.

Vishnupriya

నీ ఫ్రెండ్ విష్ణుప్రియ పర్సనల్ లైఫ్ కి సంబంధించిన సీక్రెట్ ఒకటి చెప్పమని ఝాన్సీ అడగ్గా.. శ్రీముఖి వెంటనే విష్ణుప్రియ గురించిన సీక్రెట్స్ చెప్పేసింది.
‘విష్ణుప్రియకు అక్కినేని అఖిల్ అంటే ఎంతో ఇష్టం. ఎంత ఇష్టమంటే.. అతడిని పెళ్లిచేసుకోవాలనేంత. దేవుడు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమని అడిగితే.. అఖిల్‌ని పెళ్లి చేసుకుంటానని అడుగుతుంద‌ట‌. నేను బిగ్‌బాస్ అప్పుడు నాగార్జున గారిని అడగలేకపోయాను.. అఖిల్ అంటే తనకి పిచ్చి, గజ్జి.. ఇంకా ఏవైనా ఉంటే అన్నీ… కావాలంటే విష్ణుప్రియ చేతిపై అఖిల్ టాటూ కూడా ఉంటుంది చూడండి’ అంటూ.. విష్ణుప్రియను టాటూ చూపించమని అడగ్గా ఆమె తన చేతిమీద A (అఖిల్) అండ్ విష్ణుప్రియ అని ఉన్న టాటూని చూపించింది.Vishnupriya ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఈ వీడియో చూసి ‘‘మా హీరో లవర్ బోయ్.. ఆయనంటే చాలామంది అమ్మాయిలు పడి చస్తారు.. ఆయనకివన్నీ కామన్’’.. అంటూ Proud గా ఫీలవుతున్నారు అఖిల్ ఫ్యాన్స్..