Vishwak Sen: మాస్ కా దాస్ ధమ్కీ.. సీక్వెల్ కూడా రెడీనా..?

టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న తాజా చిత్రం ‘ధమ్కీ’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాను విశ్వక్ సేన్ స్వయంగా డైరెక్ట్ చేస్తుండగా, ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మరోసారి తనదైన మార్క్ సక్సెస్‌ను అందుకునేందుకు విశ్వక్ తెగ ప్రయత్నిస్తున్నాడట. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్లు ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి.

Vishwak Sen: మాస్ కా దాస్ ధమ్కీ.. సీక్వెల్ కూడా రెడీనా..?

Vishwak Sen Dhamki Movie To Have A Sequel

Updated On : January 9, 2023 / 3:41 PM IST

Vishwak Sen: టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న తాజా చిత్రం ‘ధమ్కీ’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాను విశ్వక్ సేన్ స్వయంగా డైరెక్ట్ చేస్తుండగా, ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మరోసారి తనదైన మార్క్ సక్సెస్‌ను అందుకునేందుకు విశ్వక్ తెగ ప్రయత్నిస్తున్నాడట. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్లు ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి.

Dhamki: ‘ధమ్కీ’ ఫస్ట్ సింగిల్‌కు డేట్ ఫిక్స్ చేసిన దాస్

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తోంది. ఈ సినిమాను ఫిబ్రవరి 17న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేయగా, తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. విశ్వక్ సేన్ తెరకెక్కిస్తున్న ధమ్కీ మూవీకి సీక్వెల్ కూడా ఉండబోతుందని.. ఇప్పటికే ఈ సీక్వెల్ భాగానికి సంబంధించిన షూటింగ్ కూడా చిత్ర యూనిట్ ముగించేసిందట.

Dhamki Release Date: విశ్వక్ సేన్ ‘ధమ్కీ’ ఇచ్చేందుకు డేట్ ఫిక్స్ చేశాడు!

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న విశ్వక్ సేన్ ‘ధమ్కీ’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తోందో చూడాలి. ఇక ఈ సినిమా సీక్వెల్ భాగానికి సంబంధించిన అఫీషయల్ అనౌన్స్‌మెంట్ కూడా రావాల్సి ఉంది. ఈ సినిమాలో అందాల భామ నివేథా పేతురాజ్ హీరోయిన్‌గా నటిస్తోండగా, లియోన్ జేమ్స్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.