Vishwak Sen : విశ్వక్ సేన్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్.. తెలుగోడి ఆత్మగౌరవం ఎన్టీఆర్ అంటున్న విశ్వక్!
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న తాజా చిత్రం VS11. తాజాగా ఈ మూవీ నుంచి విశ్వక్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. విశ్వక్ ఊరమస్ అవతారంలో..

Vishwak Sen first look released from VS11 directed by Krishna Chaitanya
Vishwak Sen VS11 : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ రీసెంట్ గా దాస్ కా ధమ్కీ (Das Ka Dhamki) సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం ఈ హీరో గామి, VS10, VS11 చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇటీవలే గామి షూటింగ్ పూర్తి చేసిన విశ్వక్.. మిగిలిన రెండు సినిమాలను పట్టాలు ఎక్కించాడు. కాగా VS11 మూవీని చల్ మోహన్ రంగ సినిమాని తెరకెక్కించిన కృష్ణ చైతన్య డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన గ్లింప్స్ చూసిన తరువాత.. ఈ సినిమాలో విశ్వక్ సరికొత్త పాత్రలో కనిపించబోతున్నాడని అర్ధమైంది.
Sharwanand : యాక్సిడెంట్ పై శర్వానంద్ ట్వీట్.. నేను క్షేమంగానే ఉన్నాను!
తాజాగా ఈ మూవీ నుంచి విశ్వక్ సేన్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు మేకర్స్. విశ్వక్ షార్ట్ హెయిర్ తో, గడ్డం మీసాలు, లుంగీ, నోటిలో బీడీతో పక్కా మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. అలాగే విశ్వక్ బ్యాక్ గ్రౌండ్ లో తెలుగోడి ఆత్మగౌరవం ఎన్టీఆర్ అని రాసి ఉండి, నందమూరి తారక రామారావు ఫోటో ఉంది. ఫస్ట్ లుక్ విశ్వక్ ఫ్యాన్స్ ని బాగా ఆకట్టుకుంది. అలాగే విశ్వక్ ఎన్టీఆర్ అభిమానులను అభిమానాన్ని కూడా కొట్టేశాడు. ఇక విశ్వక్ ఈ సినిమాతో ఆడియన్స్ కి ట్రీట్ ఇవ్వబోతున్నాడని అర్ధమవుతుంది.
NTR 100 Years : ఎన్టీఆర్ శతజయంతి వేడుకల వేళ ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు.. ఆ ఫ్యామిలిలో..
ఇక ఈ సినిమాకి తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా (Yuvan Shankar Raja) సంగీతం అందించబోతున్నాడు. హీరోయిన్ అంజలి సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఆమె హీరోయిన్ గా కనిపించబోతుందా? లేదా మరో హీరోయిన్ ఉందా? అనే దాని పై క్లారిటీ రావాల్సి ఉంది. ఇటీవల సార్ (Sir) సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యున్ 4 సినిమాస్, శ్రీకర స్టూడియోస్ కాంబినేషన్.. మరోసారి రిపీట్ చేస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Vishwak Sen first look released from VS11 directed by Krishna Chaitanya