Gaami : ఓటీటీలో దూసుకుపోతున్న విశ్వక్ సేన్ ‘గామి’.. 72 గంటల్లో సరికొత్త రికార్డ్..

ప్రముఖ ఓటీటీ జీ5 లో గామి సినిమా తెలుగుతో పాటు తమిళ్, కన్నడ భాషల్లో కూడా ఏప్రిల్ 12 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.

Gaami : ఓటీటీలో దూసుకుపోతున్న విశ్వక్ సేన్ ‘గామి’.. 72 గంటల్లో సరికొత్త రికార్డ్..

Vishwak Sen Gaami Movie gets Huge Viewership in Zee5 ott

Gaami : విశ్వక్ సేన్(Vishwak Sen), చాందినీ చౌదని, అభినయ.. పలువురు ముఖ్యపాత్రల్లో విద్యాధర్ కాగిత దర్శకత్వంలో కార్తిక్ శబరీష్ నిర్మాణంలో తెరకెక్కిన ‘గామి’ సినిమా మార్చ్ 8న థియేటర్స్ లో విడుదలై మంచి విజయం సాధించింది. ఓ ప్రయోగాత్మక చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా హిట్ కొట్టి కలెక్షన్స్ కూడా భారీగా సాధించింది. సరికొత్త కాన్సెప్ట్ తో, సరికొత్త స్క్రీన్ ప్లేతో, హిమాలయాల్లో ఎన్నో కష్టాలు పడి షూటింగ్ చేసి, అఘోరా పాత్రలో విశ్వక్ నటించి, ఆరేళ్లుగా సినిమా కోసం పనిచేసి గామి సినిమాతో ప్రేక్షకులని మెప్పించారు.

గామి సినిమాకు విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రముఖ ఓటీటీ జీ5 లో గామి సినిమా తెలుగుతో పాటు తమిళ్, కన్నడ భాషల్లో కూడా ఏప్రిల్ 12 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్స్ లో హిట్ కొట్టిన గామి ఓటీటీలో కూడా రికార్డులు సృష్టిస్తుంది. జీ5 లో గామి సినిమా కేవలం 72 గంటల్లోపే 50 మిలియన్స్ స్ట్రీమింగ్ మినిట్స్ రాబట్టింది. త్వరలో 100 మిలియన్స్ స్ట్రీమింగ్ మినిట్స్ కి వెళ్లనుంది. స్టార్ హీరోలు లేకుండా ఒక ప్రయోగాత్మక సినిమా ఈ రేంజ్ లో వ్యూయర్ షిప్ అందుకోవడం గమనార్హం.

Also Read : Vijay Deverakonda : ‘ఫ్యామిలీ స్టార్’ అయిపోయింది.. నెక్స్ట్ సినిమా షూట్ మొదలుపెట్టిన విజయ్.. ఎక్కడో తెలుసా?

ఇక గామి కథ విషయానికొస్తే.. శంకర్(విశ్వక్ సేన్) అనే అఘోరాకు మనిషి స్పర్శ పొందలేడు, ఒకవేళ తగిలినా చాలా ఇబ్బంది పడతాడు. తన సమస్యను పరిష్కరించుకోవడానికి హిమాలయాల్లో మాలి పత్రాలు దొరుకుతాయని తెలిసి అక్కడికి బయలుదేరుతాడు. ఆ ప్రయాణంలో జాహ్నవి(చాందిని)తోడవుతుంది. మరి వీళ్ళు హిమాలయాలకు వెళ్ళారా? ఆ ప్రయాణంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు? మాలి పత్రాలు సాధించారా? శంకర్ సమస్య పరిష్కారమైందా? మరో వైపు ఓ పల్లెటూళ్ళో దేవదాసి, ఆమె కూతురు కథేంటి? మరో వైపు ఓ ప్రయోగశాలలో తప్పించుకోవాలనుకునే యువకుడి కథేంటి? వీళ్ళకి శంకర్ కి సంబంధం ఏంటి అన్నట్టు ఆసక్తిగా సాగుతుంది. థియేటర్స్ లో మిస్ అయిన వాళ్ళు జీ5 ఓటీటీలో చూసేయండి గామి సినిమాను.

ఇక జీ5 లో ఏకంగా 3,500 సినిమాలు, 1750 టీవీ షోలు, 700 ఒరిజిన‌ల్స్, 5 ల‌క్ష‌ల‌కు పైగా ఆన్ డిమాండ్ కంటెంట్ ఉన్నట్టు ఇటీవల ప్రకటించారు. ఏకంగా 12 భాష‌ల్లో జీ5లో కంటెంట్ ఉంది.