Vishwak Sen : విశ్వక్ సేన్ కొత్త సినిమా టీజర్.. ‘లెగసీ’.. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ కథతో..

నేడు న్యూ ఇయర్ సందర్భంగా విశ్వక్ సేన్ కొత్త సినిమా టైటిల్ టీజర్ రిలీజ్ చేసారు. (Vishwak Sen)

Vishwak Sen : విశ్వక్ సేన్ కొత్త సినిమా టీజర్.. ‘లెగసీ’.. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ కథతో..

Vishwak Sen

Updated On : January 1, 2026 / 5:18 PM IST

Vishwak Sen : విశ్వక్ సేన్ ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. చివరి సినిమా లైలా ఫ్లాప్ కావడంతో నెక్స్ట్ అనుదీప్ తో ఫంకీ అంటూ కామెడీ సినిమాతో రాబోతున్నాడు. నేడు న్యూ ఇయర్ సందర్భంగా విశ్వక్ సేన్ కొత్త సినిమా టైటిల్ ‘లెగసీ’ అని ప్రకటిస్తూ టైటిల్ టీజర్ రిలీజ్ చేసారు.(Vishwak Sen)

కాలాహి మీడియా బ్యానర్ పై యశ్వంత్ దగ్గుమతి, సాయి కిరణ్ దైడా నిర్మాణంలో సాయి కిరణ్ దైడా దర్శకత్వంలో లెగసీ తెరకెక్కుతుంది. ఏక్తా రాథోడ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.

Also See : Kajal Aggarwal : న్యూ ఇయర్ స్పెషల్.. గోవా నుంచి బోల్డ్ ఫోటోలు షేర్ చేసిన కాజల్ అగర్వాల్..

మీరు కూడా లెగసీ టైటిల్ టీజర్ చూసేయండి..

ఇక ఈ టీజర్ చూస్తుంటే.. ఇదొక పొలిటికల్ డ్రామా అని, తండ్రి రాజకీయ వారసత్వాన్ని ఇష్టం లేకుండా తీసుకోవాల్సి వచ్చినట్టు చూపించారు. అలాగే టీజర్ లో హీరో తండ్రి సమాధి మీద మూత్రం పొసే సీన్ పెట్టడంతో ఇది కాస్తా విమర్శలకు గురయ్యేలా ఉంది. మరి విశ్వక్ ఈ పొలిటికల్ డ్రామాతో ఎలా మెప్పిస్తాడో చూడాలి. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ కానుంది.

Also Read : Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కొత్త సినిమా అనౌన్స్.. న్యూ ఇయర్ రోజు ఫ్యాన్స్ కి పండగే.. ఆగిపోయిన సినిమా మళ్ళీ లైన్లోకి..