Vishwak Sen: ఓటీటీలో విశ్వక్ సేన్ మూవీ.. ఏమిటో తెలుసా..?

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించే సినిమాలకు ప్రత్యేక ఫాలోయింగ్ ఉంటుంది. మాస్ అంశాలను తన సినిమాల్లో పుష్కలంగా చూపెట్టే ఈ హీరో, ఇటీవల తన సినిమాల్లో స్టయిల్‌ను మార్చాడు. కేవలం మాస్‌నే కాకుండా క్లాస్‌ను కూడా జోడిస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ బాటలో వచ్చిన ‘ఆశోక వనంలో అర్జున కళ్యణం’, ‘ఓరి దేవుడా’ వంటి సినిమాలు ప్రేక్షకులను బాగా అలరించాయి.

Vishwak Sen: ఓటీటీలో విశ్వక్ సేన్ మూవీ.. ఏమిటో తెలుసా..?

Vishwak Sen Starrer Mukha Chitram OTT Streaming From Feb 3

Updated On : February 2, 2023 / 3:33 PM IST

Vishwak Sen: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించే సినిమాలకు ప్రత్యేక ఫాలోయింగ్ ఉంటుంది. మాస్ అంశాలను తన సినిమాల్లో పుష్కలంగా చూపెట్టే ఈ హీరో, ఇటీవల తన సినిమాల్లో స్టయిల్‌ను మార్చాడు. కేవలం మాస్‌నే కాకుండా క్లాస్‌ను కూడా జోడిస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ బాటలో వచ్చిన ‘ఆశోక వనంలో అర్జున కళ్యణం’, ‘ఓరి దేవుడా’ వంటి సినిమాలు ప్రేక్షకులను బాగా అలరించాయి.

Vishwak Sen : బాలకృష్ణ గారు నేను ఫ్రెండ్స్ అయ్యాం..

ఇక రీసెంట్‌గా విశ్వక్ సేన్ కీలక పాత్రలో నటించిన ‘ముఖచిత్రం’ మూవీ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద యావరేజ్ మూవీగా నిలిచింది. ఈ సినిమాలో విశ్వక్ సేన్ ఓ లాయర్ పాత్రలో అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈ చిత్రాన్ని రొమాంటిక్ థ్రిల్లర్ మూవీగా దర్శకుడు గంగాధర్ తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. అయితే ఈ సినిమా థియేటర్లలో అనుకున్న మేర సక్సెస్‌ను అందుకోలేకపోయింది. ఇక ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

Vishwak Sen: మాస్ కా దాస్ ధమ్కీ.. సీక్వెల్ కూడా రెడీనా..?

‘ముఖచిత్రం’ మూవీని ఫిబ్రవరి 3 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం ‘ఆహా’లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇక ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటుందా అనే ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది. ఈ సినిమాలో వికాస్ వశిష్ట, అయేషా ఖాన్, ప్రియా వడ్లమాని, రవిశంకర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.