RC15 @Vizag : విశాఖలో RC15 షూట్.. చరణ్, శంకర్ తో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు..
విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యే, టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు షూటింగ్ స్పాట్ కి వెళ్లి చరణ్ ని, డైరెక్టర్ శంకర్ ని కలిసి పుష్పగుచ్చం అందచేసి సినిమా మంచి విజయం సాధించాలని కోరుకున్నారు. గంటా శ్రీనివాసరావు...................

Vizag north MLA Ganta Srinivasarao meets Ram Charan and Director Shankar at RC15 shooting sets in Vizag
RC15 @Vizag : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం RC15 షూట్ తో బిజీగా ఉన్నాడు. దిల్ రాజు నిర్మాణంలో, శంకర్ దర్శకత్వంలో చరణ్, కియారా అద్వానీ హీరోయిన్ గా చరణ్ 15వ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా షూట్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఇటీవలే కర్నూల్, వైజాగ్, హైదరాబాద్ లలో ఓ సాంగ్ ని చిత్రీకరించారు. తాజాగా ప్రస్తుతం RC15 సినిమా విశాఖలో షూటింగ్ జరుగుతుంది.
ఈ నేపథ్యంలో విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యే, టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు షూటింగ్ స్పాట్ కి వెళ్లి చరణ్ ని, డైరెక్టర్ శంకర్ ని కలిసి పుష్పగుచ్చం అందచేసి సినిమా మంచి విజయం సాధించాలని కోరుకున్నారు. గంటా శ్రీనివాసరావు చిరంజీవికి సన్నిహితుడు కావడంతో ఈ నేపథ్యంలోనే శ్రీనివాసరావు చరణ్ షూటింగ్ స్పాట్ కి వచ్చి పలకరించాడు.
చరణ్, శంకర్ లతో దిగిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు లెజండరీ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న భారీ చిత్రం #RC15 మూవీ విశాఖపట్నంలో షూటింగ్ జరుపుకుంటున్న సందర్భంగా రాంచరణ్, శంకర్ మరియు మూవీ టీంను సెట్స్ లో కలసి అభినందనలు తెలియజేయడం జరిగింది అంటూ పోస్ట్ చేశారు గంటా శ్రీనివాసరావు. దీంతో ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు లెజండరీ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న భారీ చిత్రం #RC15 మూవీ విశాఖపట్నం లో షూటింగ్ జరుపుకుంటున్న సందర్భంగా రాంచరణ్, శంకర్ మరియు మూవీ టీం ను సెట్స్ లో కలసి అభినందనలు తెలియజేయడం జరిగింది.#SVSC #RamCharan #DirectorShankar pic.twitter.com/G21FRAdhlY
— Ganta Srinivasa Rao (@Ganta_Srinivasa) February 15, 2023